ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

విజయనగర సామ్రాజ్యము


ఆ సౌధ భాగముల వంక మీదృష్టులు సారింపుడు. విశు ద్దస్పటికశిలా నిర్మితములై యెట్లు ప్రకాశించుచున్నవో చూ డుఁడు. చుక్కలలోఁ జంద్రునియట్లు భాసిలుచున్న యీమధ్య సౌధమునకుఁబోవుదము. అది పట్టమహిషి... ఇదిగో ! ఇందలి యీపడకగదిఁ జూడుఁడు. రత్నస్థగితములై న యూకుడ్యముల సౌందర్యమును గన్ను లారఁగాంచుఁడు. అందలి యాచిత్ర ప్రతి మల సౌభాగ్యము వీక్షింపుఁడు. అందేవో మృదు మధుర కలనిస్వనములు వినవచ్చుచున్నవి. ఇవియే మైయుండును? ఎవ రిదో సంభాషణమువోలె నున్నది. లోపలఁ బ్రవేశింతము .ఆ గదిలో నొకమూల యందున్న మఱుగు ద్వారము మూసినట్లు! చప్పుడువినవచ్చిన దేమి ! అదిగో ! ఇంద్రనీలమణి స్థగితమైన యా మంచము : బట్టమహిషి పరుండియున్నది. ఆ మెకండ్డ్లె ఱగాఁ బ్రకాశించుచున్నవి. ఆమె ద్రాక్షారసము కుత్తుక కెక్క ద్రావియున్నది. ఆమె కన్నులు మూఁతలుపడుచున్నవి. ఆమె మొగము మిక్కుటమగు నలసటను సూచించుచున్నది. ఆమె తనువు మెఱుపుఁ దీవియవలె కంపించు చున్నది. మొగ మెట్లు వారియున్నది. కోపముచేతనా ? ఆమె వసనము తళతళ మెఱయుచున్నది. అది సన్నని కేంబట్టు పావడ. కుంత లములు సుపరిష్కృతములు గావు. కాని కారణము మాత్రము మనకుఁ దెలియదు. ఆమె మనమునఁ గ్రోధ మా వేశించినదా యేమి ? అదిగో ! కుతుబ్ షాహా యిటువచ్చుచున్నాఁడు. మన