ఈ పుట ఆమోదించబడ్డది

ప్రీతిపూర్వకముగ నొసంగిన రు. 1000-0-0 లతో పనిని ప్రారంభించితిమి. 1907-వ సంవత్సరము మొదలుకొని 1913 వ సంవత్సరాంతమువర కాదాయపు మొత్తము రు. 54,379-9-1. వ్యయపు మొత్తము 53,575-1-3 లు. 1913-వ సంవత్సరాంతమున నిలవ 803-14-10 లు.

ఆదాయవ్యయ వివరములును, ఆస్తి వివరమును, లాభ నష్టముల పట్టికయు అనుబంధములలో గాననగును. ఇప్పటి వరకు మండలియాస్తి రు. 7812-11-3 లుగా నున్నట్టు తెలియుచున్నది. (9, 10, 11, 12, 13 అనుబంధములు చూడుము.)

ఆదాయపు మొత్తములో రు. 4172-7-0 లు విరాళముల రూపముగా వచ్చినది. ఈ దాతలందరకును, అందు ముఖ్యము బొబ్బిలి మహారాజాగారికిని, పిఠాపురము రాజా గారికిని, మునగాల రాజాగారికిని, ఉయ్యూరు రాజాగారికిని, పిఠాపుర రాణీగారికిని, మా కృతజ్ఞతను మనఃపూర్వకముగ నిచ్చుట సూచించుచున్నాము.

ప్రతిఫలము నపేక్షింపకయె మండలికి గ్రంథములు వ్రాసియిచ్చిన గ్రంథకర్తలందరకును మా కృతజ్ఞతను సూచింపక ఈ విషయమును ముగింపజాలము. సకాలమునందట్లు వారు సాయపడకుండినచో మండలియిట్లు వృద్ధిలోనికి రాకపోయి యుండును.

మండలి యనుకరణము.

మండలి స్థాపనానంతరము నిరువదింటికి పైగా నితర సంఘము లాంధ్రదేశము నందివే యుద్దేశములతో స్థాపితము