ఈ పుట ఆమోదించబడ్డది

కావున బహుమతి మొత్తము రూ. 500 లును వారి కొసంగుటకు మిగుల సంతసించు చున్నాము. ఇదిగాక "విజయసింహ" యను నామాంతరముగల రాయచూరు యుద్ధమును, అస్తమయము, శ్రీమణి, పాతాళభైరవి, అను నాలుగు నవలలు కూడ గణనీయములని కమిటివా రభిప్రాయపడియున్నారు. అత్యుత్సాహముతో శ్రమలకోర్చి నవలలను పంపిన లేఖకులను ఈ సందర్భముగ మిగుల ప్రశంసించుచున్నాము. ఈ పరీక్షకు శ్రీమతి ముడుంబి రంగనాయకమ్మ గారు రాయదుర్గము నుండి ఒక చక్కని నవలను పంపినందులకు మేమెంతయు సంతసించుచున్నాము.

రాబోవు బహుమతి పరీక్షకు కూడ వీరందరును పట్టుదలతో విడువక కృషిచేసి జయమును పొందుటకు ప్రయత్నింతురని తలచుచున్నాము.

రిజిస్ట్రేషను.

మండలి కార్యములు నానాటికీ ప్రబలి శాఖలధికమై ఆయా శాఖలయందలి పనులును వృద్ధియగుచువచ్చెను. మండలిని శాశ్వతముగా నుండులాగు జేయ నిశ్చయించి 1860 సం|| రము 21-వ నంబరు ఆక్టు ప్రకారము 'సాహిత్య సంఘము ' గాని దీని ' మండలి ' 1913-వ సంవత్సరము మార్చి 15 వ తేదీన రిజిష్టరుచేసి యున్నాము. (అనుబంధము 8)

ఆదాయవ్యయములు.

మునగాల పరగణా జమీందారు లగు మహారాజ రాజశ్రీ రాజా నాయని వేంకట రంగారావు బహదూరువారు