ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37


పడిన ఈ వుద్యమప్రభావం "చాండిల్"లో రామఘర్ రాజా వినోబాజీని కలిసి, లక్ష ఎకరములు దానమిచ్చుటకు వాగ్దానముజేసిరి. "చాండిల్" సర్వోదయ సమ్మేళనమునకు శ్రీ జీరేంద్రముజుందారు అధ్యక్షత వహించిరి. ఈ సందర్భమున, మధ్యపాననిషేదము గురించి ఒక తీర్మానము, మరిరెండు తీర్మానములు భూదానము, గ్రామరాజ్యముల గురించి తీర్మానించబడెను, ఈ సందర్భమున శ్రీ జయప్రకాష్ నారాయణ మాట్లాడుచూ, స్వాతంత్రా నంతరము, హిందూదేశప్రజలు నిస్తేజమైవున్న సమయమున, వినోబాజీ ప్రజలకు ఒక మార్గాన్ని చూపించినారని, నూతన సమాజస్థాపనకు భూదాన యజ్ఞం పునాదివంటిదని, అన్ని పార్టీలవారు కనీసం ఒక సంవత్సరమువరకైనను, తమతమ కార్యాలను విడచి, భూదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరిరి. వినోబాజీ తమ ప్రారంభోపన్యాసములో అనేకవిషయముల గురించి వివరించిరి. దయగురించి మాటలుచెప్పుటకాదు. దయతోకూడిన రాజ్యాన్ని మనం నిర్మించాలని, జనశక్తి నిర్మాణం జరుగవలయునని, కోరిరి. భూదాన వుద్యమం హృదయపరివర్తనపై ఆధారపడివున్నదని, ఎవరిని యే విషయములోను నిర్బందించు విధానమే లేదని, ప్రతివ్యక్తికి నచ్చచెప్పుట ద్వారానే తమ వుద్యమఫలితాన్ని తాము ఆశించుచున్నామని అన్నారు.

తమ ఆశయసిద్దికై నిర్ణయించుకొనిన చతుర్విధ సూత్రములను వివోబాజీ తెల్పిరి. (1) నిర్మాణ కార్యక్రమ సంస్థలన్ని ఏకరూపంతో, ఐక్యత పొంది పనిచేయుట. (2) 1957 సం|| నాటికి 5 కోట్ల ఎకరముల భూమి సేకరించుట, (3) సంపత్తిదాన యజ్ఞము. (4) సూత్రదానము, కార్యకర్త లెల్లరు, కనీసం ఒక సంవత్సరంవరకైనా, తమ యితర కార్యక్రమాల నన్నిటిని నిలిపి, భూదాన వుద్యమానికి తమ సర్వస్వాన్ని అర్పించి, కార్యక్రమాన్ని హృదయపూర్తిగా, ఆత్మశుద్దితో కొనసాగించాలని వినోబాజీ కోరినారు.

"చాండిల్" లో జరిగిన సర్వోదయ సమ్మేళనము కార్యకర్తలకు నూతనోత్సాహమిచ్చి, భూదానవుద్యమంలో అకుంఠిత విశ్వాశాన్నిచ్చినది. దాదాపు 3 మాసములు "చాండిల్"లోగడిపిన తదుపరి, 12 మార్చి, 1953 తేదీన వినోబాజీ తమ యాత్రను బీహారులో తిరిగి ప్రారంభించిరి. "హజారిబాఘ" జిల్లాలోని "గిరిధి"లో “ధనబడ్" నాజా ఒకలక్ష ఎకరముల భూమి దానమిచ్చెను. ఇప్పటివరకు ఇంత దానము యేవ్యక్తివద్దనుంచి లభించ