ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22


ఈప్రదేశములో దర్శించలేక పోయిరి. అయినను, వారిమనసు కృత్తువులైన వినోబాజీ వారిమధ్య కొద్దికాలముండుట వారిలోని ఆనందోత్సాహములలో వుర్రూతలూగించిరి. తిరిగి 16 అక్టోబరున వినోబాజీ వుత్తరప్రదేశములో ప్రవేశించిరి. 17 వ అక్టోబరులో ఝాన్సీలో వుపన్యసించుచు, వీరవనితయైన ఝాన్సీవలె వుదారతత్వమేకాక, వీరులవలే దానమివ్వవలెనని కోరిరి. విద్యార్థుల సభలో వుసన్యసించుచు రాజకీయకార్యాలలో పాల్గొనుచున్నప్పటికి, విద్యార్థులు ఏరాజకీయ పక్షమునకు చెందివుండరాదని తెల్పినారు. "మీరందరు సింహములవలె నుండవలెను. గొఱ్ఱెలమందలు కారాదు. గుంపులు గుంపులుగాను, సంఘములు గాను వుండేపని గొఱ్ఱెలది. ఈరోజు ప్రతిఒక్కరు తమ అభిప్రాయములను విద్యార్థులపై రుద్దజూచుచున్నారు. ఈఅక్రమములనుండి రక్షించుకొనమని మిమ్ములను హెచ్చరించుచున్నాను." మధ్యభారతములోని, గ్యాలియర్ లో వుపన్యసించుచు, తాము భిక్ష నడుగుటకు రాలేదని, స్వామిత్వాన్ని త్యజించుట అనేపాఠమును నేర్పుటకు వచ్చితినని, "ఇది నాది, దీనికి నేను యజమాని" అని యనుట తప్పుయని తెల్పినారు. యాజమాన్యము నిర్మూలింపబడిననాడే రామరాజ్యస్థాపన జరుగగలదని ఆదే సర్వోదయమని తాము కోరెడి మానసిక పరివర్తనఅనే ప్రవచించినారు. జాగీరుదారుల సమావేశములో వుపన్యసించుదు వేదములలో భూమి మాతృదేవి యని చెప్పబడివున్నదని తమ మాత్రు శ్రీ పై యాజమాన్యాధికారాన్ని పొందుట పాపమని తాను పేదవారికి, జాగీరు దారులకుగూడ మిత్రులమని తెల్పిరి. ఈమాటలలోనే సత్యాన్ని గ్రహించి జాగీరుదారులు రాజపుత్రులైన తమధర్మము దానమిచ్చుటయేయని అది తామీరోజూ గుర్తించగలుగుచున్నామని భూదానయజ్ఞములో పాల్గొనుటకు తప్పక తామాలోచించి, నిర్ణయించుకొనగలమని వాగ్దానముచేసిరి. 13 వ. నవంబరు 1951 వ తేదీన ఢిల్లీచేరిరి. ఈ 62 దినముల ప్రయాణములో 19436 ఎ||ల భూమిలభించినది. ఈసమయములో తెలంగాణాలో మరి మూడువేల ఎకరములభూమి సేకరింపబడెను. హిందూదేశముఖ్యపట్టణము జేరునప్పటికి మొత్తము 35000 ఎ||ల భూమి సేకరింపబడెను. ఢిల్లీ చేరగనే ఢిల్లీ ప్రజల నుద్దేశించి, జాతిపితయైన బాపూజీసమాధిగల ఈప్రదేశ మతి పవిత్రమైనదని, వుదారహృదయయులగు ప్రజలు విరివిగా దానమివ్వవలెనని ఇది తమ కర్తవ్యమని ప్రజలు గుర్తించాలని కోరిరి.