ప్రధాన మెనూను తెరువు

పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాలతపము పెంపున యశోదానం దులకును
గృపతోడ శిశువైన కృష్ణ మేల్కనుము
పూతనాకైతవ స్ఫురిత దుర్వార
చైతన్యహరణ ప్రశ_స్త్ర మేల్కనుము
అఱి ములకి శకటాసురాంగంబు లీల
విఱుగఁ దన్నిన యదువీర ! మేల్క_నుము
సుడిగా లిరా కాసి స్రుక్కడంగించి
కెడపిన యదుబాలకృష్ణ మేల్కనుము
మద్దులఁ గూల్చి యున్మదవృత్తి మెఱయు
ముద్దుల గోపాలమూర్తి మేల్క_నుము
అద్రిరూపం బైన యఘదైత్యుఁ eso3o
రౌద్రంబు మెఱయు భూరమణ మేల్కనుము
ఆననంబునఁ దల్లి కథిల లోకములు
పూని చూపిన యాది పురుష మేల్కనుము
ఖరధేనుకాసుర క్రకచ మేల్కనుము
వరగర్వఘనబకవైరి మేల్కనుము
చతురానను ఁడు వత్పసమితి నొంచి నను.
బ్రతి యొనర్చిన పరబ్రహ్మ మేల్కనుము
గురుతర గోపాల గోపికా మూస
తరణ గోవర్ధనోద్ధరణ మేల్కనుము
కాళియ ఫణిఫణాంగణనృత్యరంగ
లాలితచరణ విలాస మేల్కనుము
అతుల కుబ్దామనోహరుఁడ మేల్కనుము
చతురమాలాకార శరణ మేల్కనుము
వనజాక్ష : యక్రూరవరద మేల్కనుము