పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 19

వ|| పదంపడి నిజానుభవం బిట్లని యుగ్గడింపం దొడంగి,

సీ||పదపద్మములఁ జిక్కి పాయదు నాదృష్టి
        కనకాంబరమున కేకరణిఁ దెత్తుఁ
గనకాంబరమునఁ గీల్కొనినఁ జలింప దే
       నుదరబంధమున నె బ్లోనరఁ గూర్తు
నుదరబంధమున నింపొంది భేదిల్లదు
       శ్రీవత్సమున కెట్లు చేరఁ దిగుతు
శ్రీవత్సమునఁ దారసిలిన రానేరదు
       కేలుదామరల కేక్రియ మరల్తు
గీ||గేలు(దామరలను గళశ్రీల మోవి
మకరకుండలముల గండమండలముల
నాసఁ గనుఁగవ బొమలఁ గుంతలము లందు
నెందుఁ బర్విన విడఁజాల దేమి చెప్ప.
సీ|| ఒసపరిపసమించు పసిఁడిదుప్పటివాని
శుభమైస యురము కౌస్తుభమువాని
దెలిదమ్మి రేకులఁ దెగడుకన్నుల వానిఁ
గమ్మకస్తరితిలకమ్మ వాని
తొలుఁబల్కుగిల్కు పావలఁజరించెడు వాని
జలవతావుల సెజ్జ నలరు వాని
నింద్రనీలపుడాలు నేలువర్ణము వాని
సిరి మరుల్లోలుపుమై చెలువు వాని