పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల



వినయవాక్యోద్ధవవినుత మేల్కనుము
కోకలిమ్మన్నఁ గైకొన కున్నఁ బట్టి
చాకిఁ గొట్టిన యట్టి సరస మేల్కనుము
భుజవిక్రమ క్రమస్పూర్తిమై భోజ
గజముఁ జంపిన బాహంగర్వ మేల్క_నుము
జెట్టి పోరను గిట్టి చీరి చాణూరు
చట్టలు వాపిన శౌరి మేల్కనుము
శంసింప జగదేక శరణంబ వైన
కంసుని తలగొండు గండ మేల్క_నుము
మానిత సామ్రాజ్య మండలి నుగ్ర
సేను నిల్పిన ధర్మశీల మేల్క_నుము
పరలోకగతులైన బాలుర దెచ్చి
గురున కిచ్చిన జగద్గురుఁడ మేల్కనుము
చండ భారతరణ చాతుర్య ధుర్య
గాండీవిసారధ్యకరణ మేల్క_నుము
బల భేది భేదించి పారిజాతంబు
నిలకుఁ దెచ్చిన జగదీశ ! మేల్కనుము
బాణబాణాసనోద్బట భీమ బాణ
పాణి ఖండన చక్రపాణి మేల్క_నుము
రాజసూయమున శూరతఁ జై_ద్యుఁ దునిమి
పూజలందిన జగత్పూజ్య మేల్కనుము
మురనరకాసుర ముఖ్య దానవులఁ
బొరిగొన్న యదు రాజపుత్ర మేల్కనుము
వీరకౌరవసభ విశ్వరూపంబు
ధీరతఁ జూపిన దేవ ! మేల్కనుము