పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/74

ఈ పుట ఆమోదించబడ్డది

51


తెలిసికొని అదే ప్రకారమిచ్చట సిద్ధము చేయించి నాడు.

హెం. అయితే ఇతనికాసంగతులన్నియు నెట్లు తెలిసెను.

మొహ. ఇద్దరు జవానులను సాధారణ వేషములతో పంపి మీ వద్దినుండి వార్త లెప్పటికప్పుడె తెప్పించుకొనుచు వచ్చెను.

హె “అయితే స్వయముగా డ్రిల్లు బాగా చేయుట యెప్పుడు నేర్చుకొనెను.

'మొహి. “ఈ మూడు నెలలనుండియు దినమును అదే పనిగా కష్టించి సాధారణజవానులలో కలిసి నేర్చుకున్నాడు.హెంకిన్ ముసిముసి నవ్వునవ్వి "ఇతడు చాలా “చా లాక్ ?గా ఉన్నాడు" అనిపలికి ఆనాడే రాష్ట్రములోని అన్ని నాకాలకును "ఎల్లందిల్ పోలీసులాగా అధికారియగు వేంకట రామా రెడ్డి ఆదర్శముగా తీసుకొని అందరుకు పనిచేయవలెను.".


అనిఅత్యంత ప్రశంసనీయముగా ఆజ్ఞలువ్రాసి పంపుచు, వేంకట రామా రెడ్డిగారికి ఒక ప్రతిపంపినారు. రెడ్డిగారు ఆప్రశంననుచూచి మురిసిపోయినారు. ఆ ప్రశంసా పత్రముతోకూడ ఇంకొక చిన్న హుకుముండెను. అందిట్లుండెను. " వేంకటరా మారెడ్డి ఈ మూడుమాసములలో వరంగల్ సదర్ అదా లత్ న్యాయస్థానమందు రెండు మారులు హాజరీ అయ్యలే

a