పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

14


టలో తప్పులు దొరలిన గోరంట చెట్లబరిగెలతో వీపులపై వాతలు పడ మోదుచుండెడి వారు. ఈ విధముగా రెడ్డి గారి విద్యా భ్యాసములో రెండవఘట్టము ముగిసెను.

వీరిజీవితమిట్లు గడుచుచుండ వీరి మేనమామగారగు విలియంవహబు గారు పోలీసు శాఖయందు ఉద్యోగులై తమ శక్తి సామర్ధ్యములచే క్రమముగా జిల్లా పోలీసు ప్రధానాధికారి (సదరు మొహతెమీం), పదవినిపొందిరి. వహబుగారప్పుడు రాయచూరులో జిల్లా పోలీసు అధికారిగా పనిచేయుచుండిరి. అప్పుడు వారు తన కుమారునితో పాటుగా చనువుకొనుటకై తన మేనల్లుడగు వేకటరామా రెడ్డిని , వనపర్తి నుండి రాయచూరునకు స్వయముగా పిలుచుకొనిపోఁయిరి. వీరు రాయచూరులో తమ 12 వ సంవత్సరమునుండి 19 వ సంవత్సరము వరకు విద్యాభ్యాసము చేయుచుండిరి. అచ్చట ఊర్దూ ఫార్సీ భాషలలో పాఠములు చదివినారు. వీరివిద్యకై ఒక మౌల్వీయున్ను తెనుగు చెప్పుటకై ఒక భట్రాజున్ను నియుక్తులై యుండి*. రాయచూరులో ఇంచుమించు నాలుగుసంవత్సరములు బాల్య మందు గడపుటచేత రెడ్డిగారికి అచ్చటి కన్నడ భాషయు మరాటీ భాషయు అలవడెను. ఇట్లు సక్రమముగా నెమ్మదిగా, సుఖప్రదముగా రెడ్డి గారి జీవితము గడుచుచుండగా తటాలున పిడుగువంటి విపత్తు వీరి కుటుంబమున సంభవించెను. వీరిని