పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202


దువులున్ను ప్రాముఖ్యస్థానాలను' వహిస్తువున్నారు. బ్రిటిషు ప్రదేశంలో కంటే హైదాబాదులో హిందు ముస్లిం సఖ్యత అధికంగా ఉన్నదని ప్రతీతి. ఎంతవున్నా, అప్పుడప్పుడు విషమ పరిస్థితులు యేర్పడక పోవటం లేదు. ఇటువంటి విషమ పరిస్థితులు యేర్పడిన పు డెల్ల మన కొత్వాలుసాహెబ్ గారు చూపుతువచ్చిన వివేకము, దూరదృష్టి, కార్యదక్షత ప్రజయొక్క, ప్రభుత్వము యొక్క ప్రశంశ పాత్రమయినవి. వీరు కమిషనరుగా వుండినంత కాలం హిందూ ముస్లింకలహాలు లేక శాంతంగా గడచిపోయింది. రెడ్డి గారు మతరీత్యా హిందువు లున్ను, జాతీయులుగా ఆంధ్రులున్ను, అయినప్పటికి హిందూ ముస్లిం సఖ్య భావాన్ని, వీరు పోషించినంతగా మరెవరున్ను పోషింప లేదు. స్వజాతీయుల విశ్వాసాన్ని, ప్రేమను యెంత గడించిరో అంతగా ముస్లింజాతీయుల విశ్వాసాన్ని, ప్రేమను గూడ గడించినారు. దీనికి వీరి నిష్కల్మష హృదయం. నిష్కాపట్య స్వభావం, ప్రజాభిమానం కారణంగా యెంచ వచ్చును. వివాదగ్రస్తములగు ముస్లిం వ్యవహారాలను సహా వేంకలరామా రెడ్డి గారి పరిష్కారం' పై ప్రభుత్వం వారు నిర్ణ యించటాన్ని బట్టి యీ ఆంధ్రుని న్యాయబుద్ధి యందు ప్రభు త్వం వారికిన్ని, ముస్లిం మహాజనులకున్ను యెంత పూజ్య భావం గలదో విశదం కాగలదు.