పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/216

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

181


వికాసములు మీ ప్రయత్న ఫలితములే. రెడ్డి వసతిగృహము, రెడ్డి గ్రంథాలయము, దేశము:నకును, సంఘమునకును, కాంతి వంతమగు భవిష్యత్తును సమకూర్చగలవు.


పితృతుల్యా !


వసతి గృహవాసులమగు మాయెడ తాము జూపు నాదరణము మరుపబడునది కాదు. గ్రామములందు విద్యాసౌకర్యములు లేక , నగరము లందలి సంస్థల నుపయో గించుకొను శక్తి సామర్థ్యములు లేక, ఉన్నతవిద్యా దూరులగుచున్న విద్యార్థుల ఉపయోగార్ధము మీరు సవీనముగ ననలంబించిన వసతిగృహ పద్ధతివలన గ్రామవాసుల యందు ఉన్నత విద్యావ్యాప్తికై యొక యుత్త మమార్గ మేర్చడినది. నిరాధా కులమగు మా విద్యాభివృద్ధికి మీరు జేసిన సహాయ మపారము, చేయవలపి నదికూడ యపార మేయని మా మనవి. బాలికల వసతి గృహముసకు సొంత భవనము నిర్మింపబడ వలసియున్నది. స్త్రీల వివ్యాభివృద్ధికై ప్రచండ ప్రయత్నము జరుగవలసి యున్న ది. మీ రారంభించిన సుస్థలు చిరస్థాయిగా నుంచుటకు మూల ధనము సేకరించ వలసియున్నది, కార్య శూరులగు. తానా మహదాశయములను సాధించి, మికీర్తి ని యజరామర మొన రించెదరుగాక. మీ జీవితము తోడిసోదరులకు ఆదర్శప్రాయ మె పరగుగాక.