పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166


ఇంతవరకు రాజాబహద్దరుగారు బీదలయెడ ఆర్త త్రాణపరాయణులని పాఠకులు బాగుగా తెలిసికొనియు న్నారు. ధనికులును వారినాశ్రయించు వారని తెలిపితిమి, వీరివలన ముఖ్యలాభములు పొందిన సంస్థానములు వనపర్తి, గద్యాల, జటప్రోలు, శివరాజ బహద్దరు సంస్థానము, పాపన్నపేట అనునట్టివి. శివరాజ బహద్దరు సంస్థానము విషయమున ఇదివరకే కొంత చర్చించి యుంటిమి. వీరు ఆసంస్థాన పరిపాలలో ధ్యక్షులుగా నుండునంత కాలము బీద రైతులు గొంగళ్లను మెడ మీద వేసికొని గుంపులు గుంపులుగావచ్చి వారి కాళ్లపై బడి వారిని చుట్టికొని తమ మొరల వినిపించెడి వారు. వారిదరఖాస్తులను తీసికొని మొట్ట మొదలు వారిని విచారించి వారికి న్యాయమును ప్రసాదించి తృప్తి పరచి పంపి తర్వాత ఇతర వ్యవహారములను విచారించు కొనుచుండిరి.


వనపర్తి సంస్థానాధీశ్వరులగు స్వర్గీయు లైన రాజా రామేశ్వర రావు బహద్దరుగారును, రెడ్డిగారును చిన్న నాడు సహాధ్యాయులుగా నుండిరి. నాటినుండియే వారిరుపుకిని పరి చయము హెచ్చుచువచ్చెను. కాని వనపర్తి రాజుగారి అపరవయః కాలములో కొంత కాలమువరకు వీరిరువురికిని మనస్తాపములు కలిగెను. సంచెర్ల అను చిన్న సంస్థానమున కొకే బాలిక వారసురాలై నిలిచెను. ఆ బాలికను తమ కుమారుడగు