పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103


కొత్వాలు:-- " నేను 60 ఏండ్ల నుండియు పోలీసులో ఉద్యో

            గము చేసి అమీన్ పదవినుండి యీ స్థానమునకు 
           క్రమక్రమమగా వచ్చినాను 

యువరాజు" నేను వచ్చిననాడు ప్రేక్షకులు 8 లక్షల వరకుండి

          రేమో వారంద రెక్కడి వారు 

కోతా:- “ నగరము వారును - చుట్టు పట్టుల గ్రామాదులనుండి

        వచ్చి, వారును నై యుండిరి.


ఈ విధముగా 2 నిముషాల వరకు మాట్లాడు కున్నారు. రెడ్డిగారు జంకు కొంకు లేక ఇంగ్లీషులో సంభాషించి నారు. వారితో మూట్లాడు కుతూహలముతోనే ముపలి ముప్పున ముప్పుతిప్పలుపడి ఇంగ్లీషు నేర్చియుండిరి. యువరాజు గారు వీరి తప్పుడు ఇంగ్లీషు మాటలను, ఉచ్చారణను వివి పొరలి పొరలి నవ్వినారు. బాగుగా ముచ్చటగా విని నారు. ఇట్లు ఎవ్వరికిని చేయని మర్యాదను, ప్రీతికిని కనబరచిన తర్వాత సెలవిచ్చు నప్పుడు ఒక పెద్ద వెండి సిగారు కేసుసు రెడ్డి గారికి ఒహుమతి - నిచ్చినారు. రెడ్డి గారు తమ జీవితములో ఎన్నడును, ఏ దుర్వభాసమును గాని ఎరిగిన వారు కారు. నస్వము గాని, సిగరెట్టు గాని డిన్నరులలో నైన కొంత బ్రాందీ సేవిం చుటగాని, ఇట్టి వేవియు వారు ఎరుగరు. కొత్వాలు పదవిపై నుండి ఇంత మంచి ఏర్పాటులు చేసిన వారు ఘాటైన సిగా