పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/83

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన యోగసిద్ధి-మత ప్రచారము 77

 
            జలబుద్భుదమువంటి జన్మంబులకును
            సిద్ధులంగోరి ప్రసిద్ధమై యోగ
            సిద్ధాంతమందు సుస్థిరమతిలేక,
            అగణిత విషయసుఖాసక్తిమీఱ,
            తగమణిమంత్ర సిద్ధ క్రియల్ నేర్చి,
            మణి పామరులకెల్ల మహిమలంజూపి,
            తిరిగెడు వారలీదేహవాసనలు,
            వీడఁగ నేరరు, వేదాంత మందుఁ,
            గూడనేనరు వట్టికుంభన గాని..."
                                           (రాజయోగసారము, ద్వితీ, ప్రక)

           కాని హఠయోగ సాధనము లేనిది రాజయోగము ఫలింపదఁట !

          “మ.హఠశూన్యంబయినకా ఫలింపదమలంబౌ రాజయోగంబొగిన్ ;
               హఠయోగంబును రాజయోగరహితం బౌనేని సిద్ధింప ; దీ
              హఠరాజంబులు రెండు(గూడ సతతాభ్యాసంబుఁ గావించు ని
              శ్శరనిస్సంశయభవ్యమానసునకున్ సాధ్యంబగున్ సర్వమున్."
                                                          (శివయోగసారము, 2 ఆశ్వా)

ఈ హఠవిద్యకే సంబంధించిన ' ఉప యోగములు రెండు గలవు. మంత్ర యోగము ; లయయోగము. మంత్రముల జపించుచు తన్మయుఁడగుట మొదటిది : ప్రాణాయామథ్యానముల దేహము శుద్ధమైనప్పడు లోపల నొకవిధమైన నాదము అఖండముగా వినఁబడునఁట. బైట మనము విను శబ్దము ఆహతము. అనఁగా, దెబ్బ గొట్టుటచేఁ గలిగినది. ఇది యనాహతము. అనఁగా, మన మెఱిఁగినట్లు ఏరెండు పదార్ధముల ఒరయికయును లేకయే కలుగునది.

     "మత్త, ఆ యనాహతనాద మెంతయు నుద్భుతంబయి యాత్మలో
              మ్రోయుచుండు నిరంతరంబు సముద్ర ఘోషముభంగి, భృం
              గాయతధ్వని రీతి, వేణుసమంచిత స్వరలీల, వీ
              ణాయతంబగు మ్రోత చందమునకా మనోలయ హేతువై"
                                                              (శివయోగ., 3 ఆ.)

ఆ నాదమునే వినుచు ఆందు మనఃప్రాణములను లయింపఁజేయుటయే లయయోగ మందురు. హఠయోగప్రవర్తకుఁడగు " శ్రీఆదినాథుఁడు" సప్పాదకోటి లయ ప్రకారములను జెప్పినాఁడఁట ! అందులో నాదలయమే ముఖ్యమని తలఁచి హఠయోగులు సద్య మనలను బ్రదికించిరి! (హఠ, 4, ఉపదే, ప. 66)

వేమన్నకు గురువైన 'లంబికాశివయోగి' యిూ హఠయోగుల గుంపునకుఁ జేరినవాఁడు. 'లంబిక' యనునది లంబికాశబ్దభవము. దవడలని యర్ధము. వానిపైఁ గల శిరోరంధ్రములో నాలుకను జోనుపవలెను. భ్రూమధ్యమందలి యెడమప్రక్క చంద్రస్థానము గలదు. నాలుకను ఆ చంద్రస్థానము నంటునట్లు చేయవలెను. అప్పడొక యగ్ని జనించును. దానిచే ఆ చంద్రస్థానమునుండి కరిఁగి అమృతము స్రవించును. దానిని త్రాగిన యోగికి రోగము, చావు, ఆకలి, దప్పి, ఆలస్యము, నిద్ర మొదలగున వేవియు నుండవు, కాని నాలుక యంతపొడవుగా సా(గుట యెట్లు ? మూcడు సాధనములు : నాలుకక్రింది నరమును క్రమముగా కోసివేయుట;