పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 76

సుషుమ్న యను నాడిమూలముగా ప్రవహింపఁగల్గును. దేహమందు మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రమువఱకును ఆరు చక్రములు గలవు. కుండలినీశక్తి చలించి సాధనబలముచే పై చక్రముల నన్నిటిని క్రమక్రమముగా భేదించి కట్టకడపటిదగు నహస్రారచక్రమును జేరఁగా, అందు బ్రహ్మ సాక్షాత్కారమై యసంప్రజ్ఞాత సమాధి కలుగును. అదే జీవన్ముక్తి. ఈ కుండలినీ యుద్బోధముగానిది బ్రహ్మాస్థానమును బొందవీలులేదు.

               “యేన మారేణ గస్తవ్యం బ్రహ్మస్థానం నిరామయమ్
                ముఖేనాచ్బాద్య తద్ద్వారం ప్రసుప్తా పరమేశ్వరీ”
(బ్రహ్మస్థానము నేమార్గముతోఁ జేరవలయునో యామార్గపు ద్వారమును ముఖముతో నడ్డగించి మూసి, ఆ పరమేశ్వరీశ క్తి (కుండలిని) పరుండి యుండును.)
                                                                                (హఠయోగ, ఉప. 3, ప.6)

కావున దానిని లేపుట ముఖ్యము. ఇట్లు హఠయోగము సాధనము ; అసంప్ర జ్ఞాత సమాధి సాధ్యము. దానినే రాజయోగ మందురు.

కాని హఠయోగపద్ధతియందు రాజయోగసిద్ధికి విఘ్నముగలిగించు సన్నివేశ ములనేకములు గలవఁట. హఠయోగము కొన్ని సిద్ధులనిచ్చును. దాని సభ్యసించు వారికి చావుండదఁట. ఆధునిక శారీరశాస్త్రజ్ఞలు చావనఁగా నేమిగా నిర్ణయించిరో యొఱుఁగనుగాని యోగుల వాదము సులభమైనది. వాయువ గలుగుట బ్రతుకు : అది పోవుట చావు; కావున దానిని పోనీక బిగఁబట్టితి మేని చావెక్కడిది

             "యావద్బవ్లో మరుద్దే హే యూవచ్చిత్తం నిరాకులమ్.
              యావత్తృప్తిత్ర్చు తాపత్కాల భయంకుతః ?"
                                                                                     (హఠ, ఉప. 2, ప. 40)
        "తే. కట్టుపడియుండు నెంచాఁక గాలిమేన,
              చిత్తమొందాఁక నెందును జెందకుండు,
              కదలదెండాఁక భూమధ్య కలితదృష్టి,
              యసయసంచాcక ప్రాణభయంబులేదు"
                                                                                      (శివయో, 3 ఆశ్వా)

ఇదిగాక ఆకాశసంచారము, కామరూపము, పరకాయప్రవేశము మొదలగు విచిత్ర సిద్ధులు హఠయోగ సాధనచే లభించునఁట. కావున సాధకులు ముఖ్యఫలమగు సమాధిని విడిచి వీనితోనే తృప్తిపడియుండుట స్వాభావికము, అట్లగుటచే హఠ యోగమును బోధించువారందఱు దీనికి ఫలము రాజయోగమే యని తల(చి సాధింపవలయుసని హెచ్చరిక చేయుచున్నారు. ఆంధ్రయోగినులలో అగ్రగణ్యురా లగు తరిగొండ వెంకమ్మ యిట్లు చెప్పినది

           "మఱికొందరీ మహామహిమ గానకయ
            గురు నెఱుంగక కర్మగురు చెంతఁజేరి,
            గాధకుఁజిక్కి దుష్కర్మ మార్గమున
            సాధనంబుగ యోగ సరణులఁ దెలిసి,
            యలమట నాసనాభ్యాసముల్ చేసి,
            చలమున బాహ్యలక్ష్యములు చూపచును,
            కూలంకషము లోని గురిగానలేక,
            లాలితంబుగ్స్ మంత్రులయహర యోగ
            ఫలములం గోరుచుఁ బామరులగుచు,