పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 67

       "ఆ. బాపఁడనఁగ నేమి ? భక్తుఁడనఁగ నేమి?
             జోఁగియనఁగనేమి ? సొపులేక
             ఎన్ని పేరులైన నినజుఁడు పనిదీర్చు...” (2720)

మనుజులకు అన్ని చింతలకంటె ఈ 'ఇనజుని' చింతయే బలవంతమైనది. పేదతనము వచ్చిన బిచ్చమెత్తియో దొంగిలించియో బ్రదుకవచ్చును. రోగము వచ్చిన మందులు దినవచ్చును; ముదిమివచ్చిన మీసములకు వన్నెయైన వేసుకొని సుఖముగా నుండ వచ్చును—కాని చావువచ్చిన ? తరువాత నేమి యను జ్ఞానమావంతరమైనను లేక యుండుటచే, ఆకస్మికముగా, ఆశ్యముగా, ఇక్కడి సుఖదుఃఖములన్నియు బొత్తిగా విడిచి, యొకటేమాఱు, ఆ యంధకారకూపములోఁ దూరవలెనన్న నెవరికి భయ ముండదు ? జాతి దీనికిఁ దప్పలేదు. ఇఁక మతమో

       "ఆ. విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి,
             వాదమేల మత విభేదమేల ?
             తెలియ లింగధరులు తిరుమణిపాలైరి..." (3575)

ఇరువురికిని చావు తప్పనిది. వారు చచ్చినఁ గాల్తురు. వీరు చచ్చినఁ బూడ్తురు రింతే. కావున నిట్టి చావస్వరూపము తెలియవలదా ? 'చావు దెలియలేని చదువేటి చదువరా ?” (3788) యని వేమన తలఁచెను.

ఈ పలుచిక్కుల సంసారపుముడిని విడఁదీయుటకు మార్గమేమి యని వెదకుట విధిలేని పనియయ్యెను. భక్తిగలిగి కొలిచిన శివుఁడో, కేశవుఁడో, యొక భగవంతుఁడు తన్నుద్ధరించునేమో చూతమని 'భక్తిగలుగ ముక్తిఁబడయుట నులభంబు' 'భక్తి కలుగుచోట పరమేశ్వరుండుండు (2814, 19) అని నమ్మి తన చిక్కులను దీర్ప భగవంతుని పలుమాఱు ప్రార్థించెను. కాని యితని యాత్రమున కా పరమేశ్వరుఁడు పలుకలేదు. ఇట్లు వా విడిచి యేడ్చెను.

       "ఆ. పలుకుమన్న నేల పలుకక యున్నావు?
             పలుకు నన్నుఁజూచి ప్రబలముగను ;
             పలుకవయ్య నీదు పలుకు నే నెగెద" (2467)

ఈ వేసరిన సమయమందే వేమన్నకు రసవాదవిద్యాభినివేశముచేత యోగుల సంబంధము కుదిరినన దనవచ్చును.

వెనుక అద్వైతమతము నాశయించినవారిలో ననేకులు దాని యనుభవమును సాధింపలేక వ్యవహారమందు ద్వైతులుగనే మాఱిరని చెప్పితిని. కాని, దీనినిగూర్చి యూరక చర్చించి ఫలములేదని తమంతట తాము ఏ కొండలలోనో, ఆడవలలోనో యుండి ఆ యుద్వైత తత్త్వమును సాధింపవలయునని పట్టుపట్టి పనిచేయుచున్న కొందఱు మొదటినుండియుఁ గలరు. వారే యోగులు.

అద్వైతమందనేక భేదములు గలవు. కాని మనదేశమందు ముఖ్యమైనవి మూఁడు : శ్రీవైష్ణవము, వీరశైవము, శాంకరము.

మొదటిదగు రామానుజసిద్ధాంతము, చిదచిదాత్మకమైన యీ ప్రపంచమును భగవంతుఁడు తననుండియే సృజించెను గావున అది మంటితోఁ జేయబడిన కడవ మంటికంటె నెట్లు వేఱుకాదో, యట్లే భగవంతునికంటె భిన్నముగాదని చెప్పచు, నా కారణమున '(విశిష్ట) అద్వైత మనఁబడినను, ముక్తియందును జీవుఁడును, భగవంతుఁడును వేఱువేఱుగానే యుందురనుటచే దీనిని ద్వైతమనియే చెప్ప వలసియున్నది. రెండవదియగు వీరశైవము, పై విశిష్టాద్వైతమునకంటె ముఖ్య