పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 62

ఇట్లు సంమమునకు సేవచేయుటకు బదులుగా దానిపై నధికారముము సంపా దించుట కొందఱి జన్మోద్దేశమాయెను. దానికై మొదలు బలవంతులగు ప్రభువుల నాశ్రయించి వంచించి లోపఱుచుకొనుట విద్యగా నేర్పడియెను ఆ కాలమందలి చిల్లర ప్రభువులను ఎట్లు వీరు లోపఱచుకొనుచుండిరో యికా క్రిందిపద్యములు విశ దీకరించుచున్నవి :

            "అనన్దబాష్ప రోమాఞ్చౌ యస్యస్వేచ్చావశంవదౌ
             కింతన్య సాధనైరన్యై కింకరాన్సర్వపార్టీవా:"
           "కౌపీనం భసితాలేపో దర్భాః రుద్రాక్షమాలికా
            మౌన మేకాసి కాచేతి మూర్ధనంజీవనాని షట్!"*[1]
                                                     (నీలకంఠదీక్షితుని కలివిడంబనము)

ఇట్లు దంభమే జీవనముగావర్తించినను అంత నష్టముండదు. మఱేమనఁగా సంతతాభ్యానముచేత ఈ దంభమే స్వభావముగా మాఱుట, ఇది యన్యాయమను జ్ఞానమే లేకపోవుట యనుననర్ధములు సంభవించినవి. బ్రాహ్మణులు నిజముగా మేము భూలోకదేవతలమనియే తల(చిరి, జంగాలు తాము సాక్షాత్తు జంగమపరమ శివులనియే నమ్మిరి. కావిబట్టలు గట్టిన మాత్రమున అందఱును తన్ను పూజింప వలయుననియు, లేకున్నవారు పతితులగుదుననియు, ఇంచుమించు ప్రతినన్న్యా సియు విశ్వసించెను. గొప్పవారియందలి గొప్పతనమును జూచియో, లేక కలదను భాంతిచేతనో, అల్పులు వారిని పూజించి గౌరవించుట తప్పుగాదనుటయేకాదుధర్మమగూడ. కాని, ఆ గొప్పవారే ఆ పూజకు తామర్హులనియు, అదిచేయనివారు నిజముగా చెడుదురనియు నమ్ముటకు మొదలిడినప్పడే ప్రపంచము పాడగుటకు ప్రారంభము.

ఈ విధముగా తత్త్వములు మతములుగా మాఱి యహంకారాభిమానములు ప్రబలించినవెంటనే,యదివఱకే యొకవిధముగానున్న జాతిభేదస్పులింగములు ప్రజ్వ రిల్లి, ఉపజాతులు ఉపోపజాతులును అసంఖ్యముగా సృష్టిచేసెను. బ్రాహ్మణలు మొదలు చండాలురవఱకును అంచును తమకన్న నొక తక్కువజాతికలదనుకొని నంతోషించిరి. చండాలురను బ్రాహ్మణులెంతదూరమున నుంతురో యంతదూరమున చండాలురచే నుంచఁబడిన "డొక్కలవారు' అను అడవిజాతివారిని నాచిన్నతనమందు చూచినాను ! జన్మభేదములకు తోడు మతభేదములునుజేరి, ఈ జాతులలో నొకరితో నింకొకరు భోజనము, వియ్యము మొదలగు సాంఘికధర్మము లట్లుండ, స్పర్శమును గూడ నహింపనట్లు చేసెను. వీరందరిపైనను అవకాశము దొరికినప్పడెల్ల అధికారము

  1. *ఎవని కానంద బాష్పములు, రోమాంచము స్వాధీనముగా నుండునో, యట్టివానికి తక్కిన సాధనములేల ? దొరలెల్ల సేవకులే. కౌపీనము, భస్మధారణము, చేతులలో దర్భ, రుద్రాక్షమాళికలు, మౌనము, ఒంటరిగా నుండుట-ఈ యాఱును మూర్థులను బ్రదికించునవి. అవి తాత్పర్యము