పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన

60

యద్వైత జ్ఞానమును అనుభవపూర్వకముగా సాధించి ద్వైత బంధమునుండి విముక్తిని జెందుటకు సామాన్యులకు సాధ్యముగాదనియు, దానికిఁ గావలసిన ఓర్పు దార్ఢ్యము సంపాదించుటకు మొదలు సగుణమగు వస్తువు నుపాసింపవలయు ననియు, అట్లేదైనా నొక మూర్తిని సర్వసర్గుణపరిపూర్ణముగా ధ్యానించుచుండిన నది నిర్గుణోపాననకు దారి చూపుననియు, నిది లేనిదది యసాధ్య మనియు అద్వైతులు తలఁపవలసి వచ్చెను -

        "క. ఉడుగని సగుణివోపాస్తికిఁ
             గడఁగక నిర్గుణమె యూదిఁగైకొనినన్
             జెప్పెడిదేమి యడుగుపోయిన
             కడవనుబోసిన జలంబు కైవడియె కదా"
                                                 (శివయోగ సారము, ఆ 1)

కావున అద్వైత వాదులందఱును చిన్ననాఁటినుండి సగుణబ్రహ్మూపాసనయే చేయవలసివచ్చెను. ఫలమేమనఁగా, వారిలో తొంబది పాళ్ళ సగుణబ్రహ్మవాదుల పూజలు, ఉత్సవములు, వేషములు, వినియోగములు మొదలగు నన్ని పద్ధతులను అవలంబించి, సిద్ధాంతమున కద్వైతులైనను వ్యవహారమునకు ద్వైతులేయై యంతటితోనే తృప్తిఁ బొందిరి. సగుణోపాసకులకును వీరికిని భేదము లేకపోయెను. అప్పటికి హిందువులలో ప్రధాన దేవతలై పరస్పరము భిన్నులైన శివుఁడును, విష్ణు వును ఒకటే బ్రహ్మయొక్క పరిణామరూపములేయని చెప్పి 'శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే", యుని యొకవిధముగా నమాధాసము చేసికొని రేకాని, సర్వమును బ్రహ్మయే యను మహెదారమతమునకుఁ జేరినవారయ్యు 'శివాయ బుద్ధ రూపాయ' యని కాని, 'జీవరూపాయ' యని కాని చెప్పఁగలిగినంత విశాలసంస్కారము వారికిఁ గలుగకపోయినది. హరినిగాని హరునిగాని ప్రత్యేకముగఁ గొలుచు ననుకూలముతప్పి, యిద్దరికి మొక్కులు చెల్లించుట, ఇద్దఱికిని దేవళములు గట్టుట మొదలగు పనులలో ద్విగుణశ్రమవ్యయములకు పాల్పడవలసి వచ్చెను. కొందఱు బుద్ధిమంతు లీకష్టమును దప్పించుటకు ఈ రెండుమూర్తులను ఒకటే దేవళమున నొకటే మూర్తిలోఁ జేర్చి హరిహరస్వామి యనుపేరఁ గొలువఁజూచిరి కాని, వేషము, వన్నె, గుణము, శక్తి మొదలగు నన్నిటియందును పరస్పరము భిన్నులైన ఈ రెండు మూర్తుల నేకీకరించుట మనుష్యశక్తికి మీఱిన పనిగావున నా ప్రయత్నము సఫలము గాలేదు.

నిర్గుణ బ్రహ్మవాదులగు నద్వైతుల యవస్థయే యిట్లైన, నిఁక సగుణ బ్రహ్మ వాదుల పరిణామము నడుగవలెనా ? గుణమనుపదార్ధము నెపుడు అంట(గట్టితిమో అప్పడే ఆ గుణము, మన యనుభవము, యభిరుచి, వీని కొలఁది మాఱును. మనుష్యుల కందఱకు ఒకటేవిధమగు ఆనుభవమును అభిరుచియుఁ గల్గువరకును వారి యుపాస్యమూర్తి కేకరూపము సంభవింపదు. కావుననే మాధుర్యము, సౌందర్యము ప్రధానముగాఁ గల మహావిష్ణుమూర్తిని కొందఱు ధ్యానించి పూజింపఁగా, మఱికొందఱు, ధైర్యము, శార్యము, నిరర్గళవిక్రమమునుగల పరమశివుని నుపాసించిరి. ఇంతటితో నిలుచునా ? మనుష్యుల యోగ్యత, సంస్కారము, సమయము, సందర్భము-దీనినిబట్టిగూడ వేఱువేఱు గుణముల యందభిమానము గల్లుట నహజముగావున, పైహరిహరవ్యక్తులందు జారత్వము, చోరత్వము, పక్షపాతము, కపటము మొదలగు గుణములు జేరఁగల్గినవి! ఇట్లు సృష్టిలోని రహస్యములను