పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 54

లలో ముఖ్యవస్తువగును. ఈ పద్యమందాభస్మీకరణ మార్గము చెప్పఁబడినది. తాళ కము తగరపురేకులో చుట్టి పెట్టిమీఁద చింతపండు మెత్తిక్రింద మీcద నుప్పుపోసి పుటము వేసిన అది భస్మమగును. తరువాత దానిని ఇతర లోహములతో చేర్చి పుటము వేసిన బంగారు సులభముగా నగును.?? కాని యీ సులభవిషయమే రహన్యమట! దాని నెఱుఁగుటయే కష్టమcట! కాని, తాళకమును తగరమును, ఉప్పుచింతపండ్లతో చేర్చి నారో కూరయో చేయు క్రొత్తపాకశాస్త్ర మర్మమొకటి తెలియువఱకును, పై పద్యము నకు మీదఁజెప్పిన యర్థమువంటిదేదో కలదని మనమందలి మంగీకరింపవలసి యున్నది గదా! కాని ఈ వాదవిద్యలో నమ్మకములేకయో, ఉన్నను హిందువు విద్యను నేర్చియుండరను నూహచేతనో, నేర్చియుండినను వేమన్నవంటి విరాగి కీ విద్యయం దాశకాని, ఆన క్తికాని యుండదని తలఁచియో, బ్రౌనుదొర ఈ పద్యమున కొక విచిత్ర విపరీత వ్యాఖ్య చేసెను. ప్రతిపదార్థము తొలుత వ్రాసి, తరువాత

  • That is, I advise you to poison yourselves either with matural poisons or with immoderate quantities of salt or tamarind acid.' " అనఁగా మీరు (కరవు వచ్చినప్పడు) సహజములైన విషములనుగాని, లేక, మితిమీఱి ఉప్పను, చింతపండుపులుసునుగాని భక్షించి ప్రాణములు వదలుcడు " అని వేమన్న క్షామమునకు చావును మందుగా హితోప దేశము చేసెనని భావము వ్రాసెను! *[1]

ఇఁక వేమనపద్యములన్నిటియందును వేదాంతార్ధము కలదనుకొని మనవా రొకరు వ్రాసిన వ్యాఖ్య మచ్చుకు

“దీనికి రహస్యార్ధము గలదు. ఎట్లనగా 'ఉప్ప నీళ్ళలో వేసినయెడల (అనఁగా అది పుట్టుచోట) ఎట్లు కరిగిపోవునో, అట్లే యీ శరీరము నశించిపోవును. చింతపండు ఎట్లు పై బెరడున్ను, లోపలిగింజయున్ను పండును అంటుకొనియు అంటుకొనకయునున్నదో, అట్లే సంసారములో నుండువాఁడును భార్యపుత్రాదులయెడ అంటి అంటక యుండవలయును. తాళకంబు నిప్పులో వేసినయెడల ఎట్లు మాయమై పొగగా పోవునో, అట్లే ఈ శరీరమును నిప్పలో వేసినయెడల కాలిపోవును. తగర మెట్ల భూమిలో వేసినయెడల ఉన్న తావు తెలియక నశించిపోవునో, అట్లే ఈ శరీరమును నశించిపోవును. కాబట్టి మీరు దీనినంతయు చూచుచుండియు దుర్భిక్షము సంభవించెనని దుఃఖించవలదని భావము. ఇంతే యీ పద్యార్ధముగాని బంగారము చేయుదానికై చెప్పినట్లు భ్రమపడగూడదు."† [2]

ఇన్ని తొందఱలేల? వేమనగూడ నొకానొక కాలమందు దీని నమ్మియుండె నేమో పోనిమ్మనుకొనినయెడల ప్రపంచము మునిఁగిపోవనా? పోనిండు. ఈ సందర్భమున ఇటీవల జర్మనీలోనో, జపానుదేశమందో యెవఁడో శాస్త్రజ్ఞఁడు రసమును బంగారముగా మార్పఁగలిగినాఁడని పత్రికలలో నెల్ల ప్రకటింపఁబడిన విషయము మీ జ్ఞప్తికిఁ దెచ్చుచున్నాఁడను. అది యసత్యమని మరలC గొన్ని పత్రికలలో ప్రకటింపఁబడెననియు మిత్రు లొకరు చెప్పిరి. ఇది యనత్యమని దృడముగా నమ్మి మనమే నెమ్మదిగా నున్నాముగాని, పరదేశమువారింకను ఈ విషయమై కష్టపడుచునేయున్నారు. ఇంతలోనే యెప్పడో దీని తత్త్వము వారి

  1. * ఓ, లై, ఈ ప్రతినెంబరు గుర్త వేయమesచితిని.
  2. † వేదాంత సిద్ధాంతము, పు.61.