పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 116

అనఁగా, భావించువాఁడు, అతని భావము, దానికి విషయమైన వస్తువు, దానిని వెల్ల డించుభాష, దానిని విని గ్రహించు సభ్యులు—ఈ యైదును కవిత్వసృష్టి యందలి పంచ మహాభూతములు. ఈ యైదింటిలో ఏది లేకున్నను కవిత్వము కొఱగాదు. కవిలేనిది కవిత్వముండదని చెప్పఁబనిలేదుగదా? అతనికి భావము లుండవలయును. భావమనఁగా పదార్ధములయొక్క స్వరూపజ్ఞానముగాని, యిదిమంచిది చెడ్డదియను నభిప్రాయముగాని కాదు. మఱి విషయమును గూర్చి మనకుఁగలుగు ద్వేషము, కోపము, అసూయ, అసహ్యము, ప్రేమ, భక్తి మొదలగునవి భావములనఁబడును. దొంగను ఉదాహరణముగాఁదీసికొందము-ఈ యనంతపురము సీమలో ప్రసిద్ధుఁడై యుండిన గజదొంగ 'నామాలసింగఁడు." వానినిగూర్చి చెప్పవలసినప్పడు వాని ఒడ్డు, పొడువ, వన్నె, కులము, భాష, ఆయుధములు మొదలగు వానిని కన్నులు మూసికొని చెప్పుట, వానిని గూర్చిన మన జ్ఞానమును తెలుపును. ఆతని వలన దేశమున కెంత నష్టకష్టములైనవో గమనించి యతఁడు చెడ్డవాఁడని తీర్మానించి చెప్పట యభిప్రాయము. ఈ రెండు సందర్భములందును కవిత్వమునకు చోటు లేదు. ఇదిగాక, అతనితో దెబ్బలు దోపులు దిన్నవారి కతనిపై కోపము జనించును : అతని సాహస కార్యములు చూచిన కొందఱి కాశ్చర్యము మెప్పును గలుగును. ఇత్యాదులే భావములు. ఇవిలేనిచోట తత్త్వశాస్త్రము, నీతిశాస్త్రము ఉండఁగలవే కాని కవిత్వముండదు. కావున కవిత్వముసకు భావములు ప్రాణముల వంటివి. ఇ(క భావములకు ఆధారమగు విషయము, దానిని వెలువఱుచుభాష కవిత్వమున కావశ్యకములని చెప్పనక్కరలేదు. ఐదవ మహాభూతము విని సంతసించువాఁడు. హృదయమున జనించిన భావములను ఎవరు విన్నను వినకున్నను బైలు పెట్టుట మనుష్య సామాన్య ధర్మము గావున, కవిగూడ నట్లే తన కొఱకే వ్రాసికొని మూసి పెట్టుకొనవచ్చును గాని యిది కవిత్వమగునా కాదాయని చర్చింపవలసిన, విని సంతోషింపవలసిన, మనములేకున్న, దాని పాలికి మన మెట్లు లేమో యట్లే మన పాలికదియులేదు కావున, కవితా సృష్టియందు సభ్యుడొక యావశ్యకమైన వస్తువే యని చెప్పక తీఱదు.

పైని యైదు వస్తువులలో భావము, విషయము అను రెంటిని గూర్చి మనకు చింతపనిలేదు. ఏ భావమైనను, ఏ విషయమును గూర్చియైనను కవికుండవచ్చును. కవికి, తానే సాక్షాత్తుగా చెప్పనప్పడు, మృదువులగు ప్రేమ, భక్తి, మెప్పుమొదలగు భావములే యుండవలయును కాని, తీవ్రములగు ఆసూయ, ద్వేషము, అసహ్యము, క్రూరత మొదలగునవి యుండరాదని కొందఱు తలఁతురు. నేనును ఇట్లు తల(చి యుండిన వాఁడనే. కాని యది పొరబాటు. కావ్యమునందు అన్ని భావములును హృద్యములుగానే యుండును. మనకు దేనిపై కోపమో ప్రీతియో కలదో దానిపై కవికిని అట్లేయుండపలయునని తలఁచుట యన్యాయము, అసాధ్యము. మనకుఁ గావలసినది ఆ భావమును కవియెంత నిజముగా తీప్రముగా తాననుభవించి, మసల ననుభవింపఁ జేసినాఁడనుటయే కాని వేఱుకాదు. ఇట్లే కొందఱు కవిత్వమునకు విషయములైన వస్తువులను నియమింప బ్రయత్నింతురు. ఇటీవల మోటారుబండ్లు, సిగరెట్ల మొదలగువానిని గూర్చి కూడ చేశాంతరములలో కవిత్వము బయలు దేఱుచున్నదనియు మన దేశమున కట్టియవస్థ రానీయరాదనియు వారు హెచ్చ రింతురు. నాకు మోటారుబండి శబ్ధముపై అసహ్యము. దాని వేగముపై ప్రతి. కావున ఈ భావములను బైలుపఱుచుచు పద్యములు నేనేల వ్రాయరాదు.