పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 96

              "బందీతు రోగ నినగెందు అంజికె బేడ,
               బందుదను ఉండు సుభిసుత్త,
               రోగబం దందిగెద్దేళు సర్వజ్ఞ." (343)

(రోగమువచ్చునేమోయని భయపడవలదు. వచ్చినదితిని సుఖింపుము. రోగము వచ్చినపుడు లేచి పొమ్ము)

అనఁగా, ఇతఁడు శాంతమూర్తియై, చప్పడులేక, యనేకులవలె చప్పిడి బ్రతుకు బ్రతికినవాఁడని కాదు, వేమనవలెనే యితనిని రేగఁబెట్టుటయు భేరిని "జోకొట్టినట్లే". మాటలపదనులో ఇరువురును ఒకరికొకరు ఎందును దీసిపోరు. ఇద్దఱి తిట్లును తెగని చే(దుగలవే. కాని వేమన్నకన్న నితనిలో నెమ్మది, ఉదాసీనము కొంచె మొక్కువగాఁ గానవచ్చును. కావుననే వేమన కున్నంత అసహ్యము ప్రపంచముపై నితనికుండలేదు.

వేమనవలె నితనికిని సంగీతమందభిరుచి కలదు. అతనికన్న కొంచెమొక్కువ ప్రవేశము గలదేమో. తంతివాద్య మేలని అందును వీణు లెస్స యని యెతఁడును తల(చెను (1029). వేమనకు ప్రియమైన ఆటవెలఁదికన్న ఇతని త్రిపది సంగీతమన కెక్కువ పనికివచ్చు స్థిరమైన లయగతిగలది ఇది పద్యమనుట కన్న పాటయనుటయే మేలు. ఏక వాదము వేమన్నకన్న నితనీ కెక్కువ పనికి వచ్చును. ఈ త్రిపదిలో పద్యములవలె, గురువు గురువు గాను లఘుపు లఘువు గాను ఉచ్చరించినఁజాలదు! తాళపు నడకకు తగినట్లుగా రెండును కొంతమార్చి సరిచేసికొనవలసి యుండును. సంగీత గాండ్ర కితని యుపదేశ మొకటి చాల విలువయైనది కలదు.

              "అర్థవిల్లదహాడు వ్యర్థసాసిర విద్దు,
               ఆర్తియిం కత్తి యరచి, దదరల్లి
               అర్థవుంటెంద సర్వజ్ఞ." (1208)

(అర్థంలోని పాటలు వేయియైనను వ్యర్ధము. మనసిచ్చి గాడిద యరచినను అందును ఆర్థముగలదు.) అర్థములేనిపాట యంతకంటె చెడుగని భావము. వేమన్నకు తోడిరాగముపైఁ బ్రీతియంటిని. ఇతఁడు నాటిరాగము లెస్స యను చున్నాఁడు (269). తోడివలె దీనియందును అసహ్యము, పట్టుదల, ఆతృప్తి, స్వతంత్రము మొదలగు భావములను జూపవచ్చు నైనను, దైన్యము దానియందు వలె దీనియందంత స్పష్టముగాఁ జూపసాధ్యముగాదు. మనుష్యుఁడనై యెందుకును జేఁతగాని వాఁడనై, యేమియుఁ దెలియనివాఁడనై, పుట్టితినే యను దుఃఖము వేమనకున్నది ; నిజమే కాని దానినిగూర్చి దుఃఖించిన "దేహము కృశించునే? (815) ఫలములేదు గావున ఉన్న నాల్గునాళ్లు చేతనైనంత పనిచేసి తనకు ఇతరులకును సుఖముగా బ్రతికి చత్తమను భావము సర్వజ్ఞునిది. నాటి రాగమందీ ధీరగుణము చక్కగాఁ జూపవచ్చును.

కావున యుద్ధసమయములందు శౌర్యము, ప్రాణమునకు వెఱవకుండుట, ఇత్యాది గుణముల నితఁడు చాల ప్రశంసించి యున్నాడు. 'అమ్మనాడిని యువదు బొమ్మ నాదడెయేను ?" (629)—బ్రహ్మయెదురు పడిననేమి ? తన బిరుదును జెప్పిపొడుపవలయును-అని యితని మతము, 'జాతి వీరరునావధీతి గంజళివరే?" (628)-'జాతివీరులు చచ్చుటకు వెఱచి వెనుదీయుదురా' యనియు "మురిదు బందగా తరియదాకత్తియు, నరెదు ముక్కువనె!"(675) -