పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

డియో మాకళాశాలకు వెదకుకొని వచ్చుచుండగా, నీవేల మాకళాశాలనువదలి పోవుచున్నావు" అని యడిగెను. అందుల కాతడేమియు సమాధానము చెప్పలేకపోయెను.

శాస్త్రులవారికి ఎక్కుడుపని తగులుచుండెడిది. ఆవిషయమును తెలుపుటకై వారు అప్పుడప్పుడు ఇట్లడుగువారు. Who is the only christian in our college? అని అందులకు విద్యార్థులు మిల్లరనియు, కాక మఱియొకరనియు చెప్పువారు శాస్త్రులవారు 'No! It is myself. I live by the sweat of my brow.' అని బదులుచెప్పువారు. మథ్యాహ్నము కార్యాధిక్యముచే వారిమొగమంతయు చెమటచే నిండిపోయెడిది.

శాస్త్రులవారు సంస్కృతనాటకములను పాఠముచెప్పునప్పుడు ఆసంవత్సరము విద్యార్థులకు పాఠ్యమైన షేక్స్పియరు నాటకముతో దానినిపోల్చి ప్రాచ్యపాశ్చాత్య రూపకసామాన్య లక్షణములను బోధించువారు. ఒకప్పుడు విద్యార్థులు మిల్లరు దొరవారి తరగతిలో ఈవిషయములే వచ్చునట్లు ప్రశ్నించిరట. మిల్లరు ఆశ్చర్యపడి ఈప్రశ్నలను ఎవరు నేర్పిరని యడిగి శాస్త్రులవారని తెలిసికొని 'అవును ఆయన గొప్ప సంస్కృతపండితుడు' అనిచెప్పెను.

శాస్త్రులవారికి ఈనౌకరిలో పెన్షనురాదు. కళాశాలవారు మొత్తముగా కొంతద్రవ్యమొసంగు నేర్పాట్లేవో చేసియుండిరి. శాస్త్రులవారికి సంస్కృతాంధ్ర గ్రంథములను పెక్కింటినిశోధించి ముద్రింపవలయునని కోర్కెయునుండినది. మరల