పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసినసంగతి వింతయైయున్నది. మీరు సాత్వికులు అందువలన నందఱు దమమీద గడుసుందన ముపయోగింతురు. దానిని మీరు మార్చినగాని యికను వలనుపడదు. మీగ్రంథమునకు బ్రాశస్త్యము త్వరలోవచ్చుననుటకు సందియములేదు. నేను నిచ్చట దానికి వ్యాప్తిగలుగునట్లుగ జదువుచున్నాను.........

పూండ్ల రామకృష్ణయ్య.
తే 19-11-97 నెల్లూరు

ఆర్యా,

నమస్కారములు. తాము మొన్నటిదినమున వ్రాసినకార్డు చేరినది. అంతకుముందే తే 17 దిననే శశిలేఖను నేనును మన మిత్రబృందమంతయు గని యలరితిమి ఎన్నిమారు వారి వ్యాసముంగనినను విషయముసున్న. ముం దేమియో చేయబోవునట్లు గన్పట్టు, వారిచే నేమియుగాదు. పండితు లీగ్రంథమును విమర్శింప నర్హులని వ్యాసమె యొప్పుకొనుచున్నది ఇది నాటకలక్షణమునకు వెలియైనట్లు వారనలేదు... ఇట్టి తాటాకు చప్పుళ్లను మీరు లక్ష్యము చేయకుడు. అందఱిని నమ్మకుడు మీకు నెక్కువ వ్రాయునంతటివాడను గానుగదా. ఎవరెన్ని పోకలపోయినను మన మేమిచేయవచ్చును. కాలము జరిగిన నొకందులకు మంచిది. అట్టివారి సంశయములకు సమాథానము వ్రాయవచ్చును.

విధేయుడు,
పూండ్ల రామకృష్ణయ్య.