పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'స్థూలారుంధతీన్యాయము'నఁ దమ్ము గీర్తించుకొని వ్యంగ్యగర్భితముగ నాకు మిత్రులు వారని సహచరులు నితరులకుఁ బరిచయ మొనర్చి వారిపనులు చక్కబెట్టుటయుఁ గలదు.

'ఇరువురు స్తోత్రపాఠకు లొకచోఁజేరిన వాక్పిశాచములు విందొనర్చుకొను నని యొక తాత్త్వికుఁ డనినాఁడు. నిజము. ఇరువురి జిహ్వలు వాక్కులకు వాతరాయణములు. తేనెబూసిన కత్తులు. ఇట్టి రసనలు బాహ్యప్రపంచము పై జైత్రయాత్రలు వెడలుట నిత్యమును మన కనుభూత మగుచున్న యంశము. స్తోత్రపాఠముల నెల్ల నుత్తమోత్తమమైనది వ్యక్తియభి భాషణము. ఔను కాదనక శిష్యభావముతో 133[1]ఋషభములు నిండ వినుటయే. ఈ ధర్మ సూక్ష్మమును గ్రహించిన స్తోత్రపాఠకుఁడు 'స్తుతిప్రియ - 134[2]'క్షేత్రియోవ్యాధి' గ్రస్తమైన యెట్టి నివాతశిలాకంధ హృదయ క్షేత్రములోనైనఁ బ్రవేశించి విజయమును గరతలామలకము గావించుకొనఁ గలఁడు.

వీరు మాటల పెట్టుబడియైన లేక విశేష లాభముల గ్రహించు 'విచిత్రధనిక వాదులు. వీరు పొందు లాభములు 'కంచనాలు' వేసి యెంతటి చారదక్షమైన ప్రభుత్వమును దగిన 135[3]దండుగు' బుచ్చుకొన నేరదు.

'స్తోత్రపాఠ మొక వ్యసనము' అత్యనారోగ్యకరమైన వ్యసనము. మద్యముల వలెఁ గొన్ని యౌషధసంబంధములైన ప్రయోజనములున్నవని కొందఱు వాదించినను నిశిత హృదయ మంగీకరింపని వ్యసనము. మద్యపానమువలెఁ బ్రభుత్వములు నిషేధింపలేని వ్యసనము.

బాల్య యౌవన కౌమారములలో నున్న యెవరైనను స్తోత్రపాఠవ్యసనాయో మయ కలుషశృంఖలములనుండి విడివడలేకున్నారు. బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్న్యా సాశ్రమవాసులలో తురీయులైన దీనిఁ బరిత్యజింపలేకున్నారు. నేఁడు 136[4]పాలమోర్ వంటి ప్రసిద్ద ఖగోళ శాస్త్ర పరిశోధనాలయము నందలి రెండు వందల యంగుళముల వెడల్పు గల 'భూతదర్పణము' లున్న యంత్రముల వలనైన యందుకొని దర్శింప రాని నక్షత్రములఁ 137[5]దురీయయంత్ర, రామయంత్రములఁ గనుఁగొన నేర్చిన మహర్షులైన దీనిపై మనసుగొనినారు. బ్రహ్మజిజ్ఞాసువుల నైననిది పట్టి బాధించినది.

ఇంతకు నిట్టి లోపము దేవతలలోనే యున్నది. స్తోత్రపాఠ ప్రియత్వము లేని

దేవత ముక్కోటి దైవతములం దొక్కరైనఁ గన్పింపరు. త్రయీవేదముల విధ్యుక్తముగ
  1. 133. ఋషభములు = చెవి రంధ్రములు
  2. 134. క్షేత్రియోవ్యాధి = ప్రకృతి సహజమైన వ్యాధి
  3. 135. దండుగు = దోషములకుఁ బ్రభువులు పుచ్చుకొను నపరాధద్రవ్యము
  4. 136. పాలమోర్ = అమెరికాయందలి సుప్రసిద్ధ ఖగోళశాస్త్ర పరిశోధనాలయ ముండుచోటు
  5. 137. తురీయ యంత్రము = ప్రాచీన వేదర్షులు దీనిమూలమున గ్రహవేధల నిర్ణయించిరి. రామయంత్రము = క్రీ.శ. 15వ శతాబ్ది భారతదేశమున ఖగోళ విజ్ఞానమున గ్రహింపనున్న యంత్రము.

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

77