పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పుష్టివర్ధనమైన యీ నెత్తావిసంపుటి యొకనాఁటిదా! ఒక చోటిదా!! దీని సంపాదించువేళ:

సీ. "కేళీసరోవీథి నాళీక వా టీషు
            ధూళీఝరీరాజి తేలి తేలి
    చోళీమహాభోగచూళీనవప్రసూ
            నాళీ సుగంధంబు లాని యాని
     లోలీభవత్పుష్పధూళీచరద్భృంగ
           పాళీనిరోధాప్తిఁ దాళి తాళి
     తాళీవనీనారి కేళీరసాలకం
           కేళీహితచ్ఛాయఁ గెరలి కెరలి

తే.గీ. మెలఁగు నామని మణిధరావలయనిలయ
     కనకనందనచందనాకలితలలిత
     వలితలవలీనికుంజాబ్జవదనమదన
     కదనఘర్మాప(హుం డయ్యె) గంధవహుఁడు.”

వసంతప్రాదుర్భావమున మలయానిలుఁడు సమస్త ప్రపంచమునఁ దానెయై ప్రవర్తించి యాకర్షించినాఁడు. [1]ఒనర హిమావకుంఠనము లూడ్చి తెమల్చిన పత్రభంగముల్ సన నసియాడుచు న్మొగుడి చెక్కుల పల్లవపాణిఁ గప్పు నూతనలతి కాలతాంగుల నుదారగతి న్జలివాపినాఁడు. వారికి నెయ్యంపుఁ బెనఁకువ నేర్పినాఁడు. నితాంతనూతనలతాంగా శ్లేషముల్ నిశ్చలలీల న్మధుపాంగనా సమితి కలరఁజేసినాఁడు. సంధించు తామ్రాక్షియౌ కలకంఠిని నేర్పు మెఱయఁ బలికించినాఁడు. లోక మతని భుజంగగ్రామధామైక సంకలనాభ్యాస విలాసపాటవునిగఁ గీర్తించినది. కొమ్మల డాసి పండుటాకుల మిషతో నిచోళావకుంఠనముఁ దొలగించు చిలిపితనమును గూర్చి లోకము పరిపరి విధములఁ జెప్పుకొనినది.

ఈ గంధవహుఁ డెవ్వఁడు? ఏ కడవాఁడు? ఈతని రాకకుఁ గారణ మెయ్యది? భావుకుల నీ ప్రశ్నలు కలఁతపెట్టినవి, అతని వంశాభిజాత్యములు గుర్తించినవా రతఁడు పుట్టుపూర్వోత్తరములు, మట్టుమర్యాదలు లేనివాఁడు కాఁడని నిర్ణయించి యతని

చరిత్రనిట్లు సంక్షేపముగఁ బ్రవచించినారు.
  1. ఒనర హిమావకుంఠనము - వసుచరి. ఆ. 1, ప. 127

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

41