బహుళ ద్వితీయ (క్రీ.శ. 154) అనీ,36 " వీరపురుషదత్తుని (ఇక్ష్వాకువంశపు రాజు) నాగార్జునకొండ శాసనంలో 'హేమంతః పక్షః షష్టః దివసః త్రయోదశః : మాఘ శుద్ధ త్రయోదశి' అనీ " కనిపిస్తున్నది. పల్లవులలో తరువాతి రాజుల కాలంలో మాస నామాలు కన్పిస్తున్నవి.37 శకవర్ష ప్రశంస కన్పిస్తున్నది. కుమారవిష్ణు చందలూరు, ఉరవవల్లి శాసనాలు ఇందుకు నిదర్శనము.38,39 రాజరాజ నరేంద్రుని వంశస్థుల శాసనాలలో సింహమాసము, 40 తులామాసము "" అనే వ్యవహారం ఉంది. ఇలాగే ఉత్తర దక్షిణ భారతదేశంలోని శాసనాలను పరిశీలిస్తే సంవత్సరానికి సంబంధించి విశేషాలెన్నో బయల్పడతవి. 42
18
“అబ్దాదౌ బంధుసంయుక్తో మంగళ స్నాన మాచరేత్
వస్త్రైరాభరణై దేహ మలంకృత్య తత శుచిః ।
విఘ్నేశం భారతీం ఖేటాన్ దైవజ్ఞ మభిపూజ్యచ,
సంవత్సర ఫలం సమ్యక్రుత్వా విప్రాన్ సమర్చయేత్. ||"
అనాదినుంచి సంవత్సరాది ఒకే నియతమైన ఋతువులో గాని, మాసంలోగాని,
పక్షంలోగాని రావటం జరగలేదు. అనేకరీతుల మారుతూ వచ్చిందని మనం
గమనించాము. అందువల్ల పూర్వకాలంలో సంవత్సరాది ఆచారాలు విస్పష్టంగా ఇలా
ఉన్నవని చెప్పటం కష్టం. అయితే మొట్టమొదటి సంవత్సరాది నాడే యజ్ఞం
ప్రారంభమయ్యేది. సంవత్సర కాలం అది జరుగుతూ ఉండేది. నేడు మనం
ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలాలలోనూ, నక్షత్ర దర్శన సమయాలలోనూ చేసే
కార్యకలాపాలన్నీ ఆయా కాలాలతో సంవత్సరం ఆరంభించినప్పుడు సంవత్సరాది
కృత్యాలుగా ఉన్నవని ఊహించవచ్చు.
నేడు సంవత్సరాది చైత్రశుద్ధ ప్రథమ. ఇప్పుడు నింబకుసుమ భక్షణం, పంచాంగ
శ్రవణం తప్ప విశేషంగా పాటిస్తున్న ఆచారాలు ఆంధ్రదేశంలో ఏమీ లేవు. సంవత్సరాది
నాడు సదాచార సంపన్నుడు అంగుళీస్ఫోటంలో నిద్రలేచి శ్రీమచ్ఛంకర
భగవత్పాదులవారు చెప్పిన
"ప్రాతఃస్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్ ।
యస్తు ప్రజాగరసుషుప్త మతి నిత్యం
తదృహ్మ నిష్కలమహం న చ భూత సంఘః ॥
సంస్కృతి
377