పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/376

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వచ్చింది. దీనికి 12 ముళ్ళు ఉంటవి. పగటిని తెలియజేస్తుంది. తరువాతి కాలంలో జలఘటికాయంత్రాలు వచ్చినవి.


పూర్వం మఠాలలో, సంఘారామాలలో ఇవి ఉండేవి. మోఖరీ మైత్రికుల కాలంతో క్రీ.శ. 5వ శతాబ్ది మొదలు ఏడవ శతాబ్దం వరకూ ఉత్తరదేశంలోనూ, తరువాత బహుకాలం వరకూ దక్షిణాదేశంలోనూ ఇవి ఉన్నవి. 32 వీటిని సంఘారామాలలో కుర్రవాళ్ళ చేత పట్టించి వాళ్ళు వచ్చి కాలాన్ని చెప్పుతుంటే ఘటికాస్థానంలో గంటలు కొట్టేవారు. మన పిల్లలమర్రి పినవీరన పీఠికలలో "చిడిముడి జాహ్నవీతటిని శీకరపోతముజూచి యెవ్వరీ కొడిమలుగట్టి పెండ్లికొడుకున్ గడియారము మోపజేసి రంచడుగ”లో సూచించింది ఈ విషయమే. మధ్యాహ్నాన్ని, కుతపకాలాన్నీ తెలుసుకోటానికి షష్ఠి యంత్రాన్ని ఉపయోగించేవారు. పెద్దన్నగారు ప్రవరాఖ్యుని ఇంటికి యోగిని కుతప కాలంలో తీసుకొని వచ్చారు. బహుశః రాయల కాలంలో (క్రీ.శ. 15 శతాబ్ది పూర్వభాగం) ఆంధ్రదేశంలో ఇవి ఉపయోగంలో ఉండి ఉండాలి. గణిత శాస్త్రసహాయంతోనూ, యంత్రసహాయంతోనూ మన పూర్వులు పరిపూర్ణ కాలవిజ్ఞానం కలిగి వ్యవహరించారనటం నిస్సంశయము. వారి అనంత కాలవిజ్ఞానం వేదకాలం నుంచీ అవ్యవచ్ఛిన్నంగా వస్తున్నది. ఇటువంటి వారు ఇతరుల దగ్గర నుంచి జ్యోతిష విజ్ఞానాన్ని గ్రహించారని పాశ్చాత్యులు కొందరు వ్రాస్తే వ్రాసి ఉండవచ్చు గాని, దానిని మనవారు కూడా కొందఱు నమ్మటం శోచనీయం. పాశ్చాత్యులలో బుద్ధిమంతులు కొందరు సత్యప్రియులై, 'ఈ నాడు నూతనంగా కనిపెట్టబడ్డవని' చెప్పుకునే యురేనస్, నెప్టూన్ గ్రహాలు కూడా మన భారతీయులకు తెలుసునని అంగీకరిస్తున్నారు.34


17

ప్రాచీన శాసనాలను చూస్తే క్రింది విశేషాంశాలు సంవత్సరానికి సంబంధించి కన్పిస్తున్నవి. ఒక కుషాణ రాజు తక్షశిల శాసనంలో (క్రీ.శ. 79) 'అషాఢస్య మాసస్య దివసే పంచదశే' అని మాస నామం కనిపిస్తున్నది. (Ep. hd. XIV. P125) 'మహారాజస్య కనిష్కస్య రాజ్యతృతీయే హేమంతమాసే తృతీయే పూర్ణిమాంతమాఘే' (37-39 Selective Inscriptions - D.C. Circar) శాతవాహన రాజుల కాలంలో గాని, ఇక్ష్వాకు రాజుల కాలంలో గాని శాసనాలలో మాసనామం కన్పించడం లేదు. కృష్ణ పక్షంతో నాలుగు మాసాలు గల మూడు ఋతువులు ఆరంభిస్తున్నట్లు నిదర్శనాలున్నవి. వాశిష్ఠీ పుత్ర పులోమావి కార్లే శాసనాలలో 'గ్రీష్మ పక్షే పంచమే దివసే ప్రథమే' : జ్యేష్ఠ కృష్ణ ప్రథమ (క్రీ.శ. 137) అనీ, 35 'హేమంత పక్షే తృతీయే దివసే ద్వితీయే : పుష్య 376 వావిలాల సోమయాజులు సాహిత్యం-4