మం 1 అను 22 సూక్తం 80, మంత్రం 48 వారాన్ని గురించి చెబుతున్నదనీ, దీనిని భారతీయులు గ్రీకుల దగ్గరనుంచి గ్రహించలేదనీ మరొకమతం.29 " తైత్తిరీ యారణ్యకంలోని ప్రశ్న 1 అనువాకం 3. పంచతి 1 ఏడుదినాలు గల వారాన్ని సూచిస్తున్నదని రెండవ మతం. ఋగ్వేద సంహితలోనూ, తైత్తిరీయారణ్యకంలోనూ పేర్కొనబడ్డ వారాలనే తరువాతి కాలంలో సిద్ధాంతులు విపులీకరించి ఉంటారు. వారం ఇంచుమించు పక్షములో సగభాగము. సూర్యుడు ఉదయం ఏ గ్రహపరిధిలో ఉదయిస్తాడో ఆ దినానికి ఆ గ్రహనామాన్ని బట్టి పేరు వచ్చింది. సోమవారం నాడు సూర్యుడు చంద్రుని పరిధిలో ఉదయిస్తానడన్న మాట. ఇదే రీతిగా మంగళవారం నాడు కుజపరిధిలో. కౌటిల్యుని అర్థశాస్త్రంలో సప్తవార విభాగం లేదు, పంచవార విభాగం ఉంది. అమర సింహుడు వారనామాలను పేర్కొనలేదు. సప్త సంఖ్యతో మాసం గాని, సంవత్సరం గాని సమానంగా విభజితం కావడం లేదు. అయితే పంచాంగాలలో వారం ఒకటి నిత్యోపయోగంలో ఉంది.
14
నెలకు ముప్పది దినాలని మనం వ్యవహరిస్తున్నాము. అనేక విధాలైన దినాలు నేడు కనిపిస్తున్నవి. ఒక నక్షత్రం ధ్రువం చుట్టూ ఒకసారి తిరగటానికి పట్టే కాలము 23 గంటల 56 ని. 40.9 సెకండ్లు. దీనికి నక్షత్ర దినమని పేరు. ప్రాచీనులు నక్షత్ర దినానికి అరవై నాడులున్నవన్నారు. ప్రతి నాడికి అరవై వినాడులు. ప్రతి వినాడికీ ఆరు ప్రాణాలు. ప్రతి ప్రాణికీ పది గుర్వక్షరాలు. గుర్వక్షరం ప్రతిదానికీ నాలుగక్షరాలు. ఈ దిన విభాగం అతి ప్రాచీనమైంది. "గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సాచతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషి. సహస్రాక్షరా పరమేవ్యోమమ్." ఈ మంత్రంలో పైన పేర్కొన్న దిన ప్రయాణం నిబద్ధమై ఉందట. 1x2x4×8 × 9× 1000 = 864000 అక్షరాలు. మన పూర్వులు దిన ప్రమాణాన్ని కొలవటానికి అక్షరాన్ని (శబ్దాన్ని) ఆధారం చేసుకున్నారు. ఋగ్వేదంలో ఉన్న మొత్తం అక్షరాలు ఒక సౌర సంవత్సరానికి ఎన్ని అక్షరాలు ఉన్నవో అన్నేనట. అంటే 864000. ఈ విషయాన్ని గురించి ఒక అభిజ్ఞుడు 'ఆరు గడియారము' వలె మన పూర్వులు ఋగ్వేదాన్ని ఉపయోగించారు. పై గడియారము ఒక సెకండు కాలాన్ని, అంటే సౌరదినంలోని 864000 భాగాన్ని మాత్రం కొలవగలుగుతుంది. దీనిని బట్టి ప్రాచీనులకు నిష్కర్షగల ఒక కాలమాపక మున్నదని అర్థమౌతుంది' అని వ్రాసినాడు. 30 374 వావిలాల సోమయాజులు సాహిత్యం-4