certainly in Vogue. The other practice again came into use after this, perhaps
being copied from the Greeks, to suit the shifting back in seasons as measured
by the old months which had happened by the time, a reform perhaps
introduced by King Vikramaditya like similar reforms in calenders introduced
by many Kings in the West."
(Ep. India P. 317)
సిద్ధాంత గ్రంథాలు శుక్లపక్షాన్నే ప్రథమ పక్షంగా చెబుతున్నప్పటికీ, ఉత్తర
భారతంలో ఈ నాడు కూడా మాసం కృష్ణ పక్షంతో ఆరంభిస్తున్నది.
12
సూర్య చంద్రుల మధ్య ఎడమున్న పన్నెండు అమావాస్యలు కల పన్నెండు చాంద్రమాసాలు ఒక చాంద్ర సంవత్సరము. దీనికి దినాలు 354 మాత్రము. తిథులు 360. రవిచంద్రుల గమనం వేసవిలో వడిగా ఉంటుంది. శీతకాలంలో మెల్లగా ఉంటుంది. దీర్ఘాహము ఘ 65-16; హ్రస్వాహము 53-56. ఇందువల్ల 360 తిథులను సరిపెట్టుకోవలసి వచ్చింది.25 " చాంద్రమాసాదులలో 7 వృద్ధితిథులు, 13 క్షీణ తిథులు వస్తున్నవి.
చాంద్ర సౌరమాసాలను సరిపెట్టటానికి అధికమాసాన్ని చేర్చటం ఋగ్వేద కాలంనుంచీ కనిపిస్తున్నది. అప్పుడు ఎలా సరిపెట్టేవారో చెప్పలేము. రెంటికీ మధ్య ఉన్న తేడా సవరించడానికి మనవారు మూడు సంవత్సరాల్లో ఒక అధికమాసం గాని, లేదా అయిదు సంవత్సరాల్లో ఒక అధికమాసం గాని చేరుస్తారు. పందొమ్మిది సంవత్సరాలలో ఏడు అధికమాసాలు వస్తవి. దిద్దుబాట్లు విశేషంగా వచ్చినప్పుడు ఒక మాసాన్ని తగ్గించవలసి వస్తుంది. క్రీ.శ. 1826లో ఇలా తగ్గించిన ఒక లుప్తమాసం వచ్చింది. క్రీ.శ. 1963, 1964 లోగా మరొక లుప్తమాసం వస్తుంది.
13
నేడు ఆంధ్రదేశంలో ఆదిత్య సోమాది వారాలు వ్యవహారంలో ఉన్నవి. ఇవి నేటి రూపంలో ఇతిహాసకాలంలో లేవని ఒక అభిప్రాయం ఉంది.26 ఇవి అవైజ్ఞానికాలనీ, వీనివల్ల జ్యోతిష్య శాస్త్రంలో తప్ప ప్రయోజనం లేదనీ, మరిచిపోతే వీటిని ఉద్ధరించటానికి మార్గం లేదనీ మరొక అభిప్రాయం.27 వారంలోని దినాలకు 'శక' మనీ, తత్సంబంధమైన జ్ఞానాన్ని మనవారు శకజ్ఞాన మన్నారనీ, ఋగ్వేదంలోని సంస్కృతి
373