చైత్రాదిమాస నామాలు కలిగినవి. చైత్రమాసంలో పూర్ణిమనాడు 'చిత్ర'లో ఉంటాడు.
ఇలాగే వైశాఖంలో విశాఖలో.
రాశిచక్రంలో చంద్రగమనాన్ని బట్టి చైత్రాది మాసాలు ఏర్పడుతున్నవి. చంద్రుని
గమనం వల్లనే భారతీయులకు నక్షత్రాలు తోచినవి. నక్షత్రాలను ఆధారం చేసుకొని
మొదట చంద్రగమనాన్ని, తరువాత సూర్యగ్రహ గమనాలనూ నిర్ణయించారు. నక్షత్రాలు
ఆకాశంలో ప్రయాణం చేసే దేవయాత్రికులకు మైలురాళ్ళ వంటివని భారతీయులే
నాడో గుర్తించారు. సూర్యుని గమనం గాని, ఇతర గ్రహాల గమనం గాని చంద్రుని
గమనానికి భిన్నం కాకపోవటం వల్ల 27 నక్షత్రాలను 12 రాసుల క్రింద
విభజంచారు.21 నక్షత్రం ఒకటి నాలుగు పాదాల చొప్పున 27 × 4 = 108 పాదాలను
పన్నెండు రాసులు క్రింద సర్ది, సూర్యుడు నెలకు 9 పాదాలు గమిస్తాడని మనవారు
నిర్ణయించారు. చైత్రాది మాస నామాలు పుట్టక పూర్వం, మధు మాధవాది మాస
నామాలు సూర్యునిబట్టే వ్యవహారంలో ఉండేవి. రాశిచక్రంలో సూర్యగమనాన్ని బట్టి
మేష, వృషభాది మాసాలు వచ్చినవి. ఇవి చైత్ర వైశాఖాది మాసాలకు తరువాత
పర్యాయపదాలైనవి. కవితా స్వభావం గల భారతీయ దైవజ్ఞులు వీటిని (సౌర
మాసాలను) చంద్రుని సంతానమని వ్యవహరించారు. 22
10
భారతీయుల రాశి చక్రంలో 27 నక్షత్రాలున్నవి. ప్రతి నక్షత్రంలో ఒకటి,
రెండు, మూడు లేక అంతకంటే మించి చుక్కల గుంపులు ఉంటవి. ప్రతి నక్షత్రంలోనూ
కాంతిమంతమైన చుక్క ఒక్కటి ఉంటుంది. దాన్ని మనవారు 'యోగతార' అని
వ్యవహరించారు. ఇవి క్రాంతి వృత్తానికి మధ్యమార్గంలో ఉండటం వల్ల చంద్రునితో
కూడడానికి, గ్రహాలతో యోగం పొందడానికి వీలవుతుంది.
వైదిక సాహిత్య కాలంనాడే ఆర్యులకు 27 నక్షత్రాలు తెలుసు. మొదట చంద్రుడు
దినానికి ఒక నక్షత్రంతో ఉన్నట్లు భావించి, చాంద్రమాసానికి 28 దినాలు మించి
ఉండడం వల్ల 28వ నక్షత్రం కూడా కల్పన చేశారు. దీని పేరు అభిజిత్తు (Vega
Alfra Lyra) దీనిని తైత్తిరీయ బ్రాహ్మణకాలంలోనే గుర్తించారు. మహాభారత
వనపర్వంలో (23) రోహిణిమీద అభిజిత్తుకు ఈర్ష్య కలిగి సహించలేక తపోవనాలకు
వెళ్లిపోయినట్లున్న కథ దీనికి సంబంధించిందే. ఈ అభిజిత్తు ఉత్తరాషాఢ శ్రవణాలకు
మధ్య ఉండేది. అభిజిత్తు తపోవనానికి వెళ్ళిన తరువాత ఇంద్రుడు కాలాన్ని
గుర్తించలేకపోతే, బ్రహ్మ స్కందుడు దాన్ని ధనిష్ఠ నుంచి గుర్తించారట. 23 తరువాత
సంస్కృతి
371