పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/370

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధుమాధవ మాసములు, గ్రీష్మంలో శుక్ర శుచి మాసాలు. వర్షర్తువులో నభోనభస్య మాసాలు, శరత్తులో ఇషోర్ణములు, హేమంతంలో సహస్సహస్య మాసాలు, శిశిరంలో తపస్తపస్య మాసాలు ఉన్నవి. ఈ ఋతుమాసాలు వ్యవహారంలోకి రాక పూర్వం ద్వాదశాదిత్యుల పేర్లు పుట్టి ఉంటవి. దీనికి కారణం ఆయన గతి తిన్నగా తెలియక పోవటమే. ద్వాదశాదిత్యులు వసంతంలో ధాత అర్యములు. గ్రీష్మంలో మిత్రావరుణులు, వర్ష ఋతువులో ఇంద్ర వివస్వతులు, వర్షర్తువున పర్జన్య - పూషులు.

హేమంతంలో అంశు భగులు, శిశిరంలో త్వష్టృ - విషులు19. వసంత గ్రీష్మ వర్షాలు మూడు దేవ ఋతువులనీ, శరద్ధేమంత శిశిరాలు మూడు పితృఋతువులనీ శతపథ బ్రాహ్మణము.
- సంవత్సరము ఒక పిట్ట. వసంతం దాని తల. గ్రీష్మం కుడి రెక్క శరత్తు ఎడమ రెక్క వర్షము తోక' అని ఒక బ్రాహ్మణంలో ఋతువు స్వరూపం నిరూపించి ఉంది. దీన్నిబట్టి ఒకానొక కాలంలో వసంతం ఋత్వాదిగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. వాసంత విషువము (Vernal Equinox - షుమారు మార్చి 21) మొదలు ఆరు నెలలు ఉత్తరాయణము. శారద విషువము షుమారు సెప్టెంబరు 21 మొదలు ఆరునెలలు దక్షిణాయనము. తరువాత కాలక్రమాన ఇది మారి ఉత్తరాయణము దక్షణాయనాంత దినము (Winter Solstice డిసెంబరు 21) నుండి ప్రారంభించింది. మరి కొంత కాలానికి తిరిగి వాసంత విషువద్దినం నుంచి సంవత్సరము ఆరంభమైంది. మహాకవి కాళిదాసునాడు చాంద్ర ఆషాఢ శుక్ల ప్రతిపత్తునాడు దక్షిణాయనారంభము. సౌర మాఘంలో ఉత్తరాయణము. పురాణాలలో, సాహిత్య గ్రంథాలలో చైత్ర వైశాఖాలు వసంత ఋతువని కనిపిస్తున్నది. తరువాత వచ్చిన జ్యోతిష సిద్ధాంతులు ఫాల్గున చైత్రాలు వసంత ఋతువని నిర్ణయించారు. ఇప్పటికీ ఉత్తర దేశంలో 'ఫాల్గున చైత్రాలే వసంతము. తైత్తిరీయ సంహితాకాలంలో వసంతము ఋతుముఖము. అప్పుడు సంవత్సరాది ఫాల్గున పూర్ణిమ. శిశిరము ఋతుముఖంగా కొంతకాలం ఉంది. వరాహ మిహిరుడు ఫాల్గునంలో సంవత్సరారంభం చేశాడు. భాస్కరుడు (క్రీ.శ. 1150) మరల వసంతము ఋతుముఖంగా పేర్కొన్నాడు.

9


మన సంవత్సరానికి పన్నెండు మాసాలు. 'మస్యతే పరిమియతే నేతి మాసః మసీ పరిమాణే' దీనిచేత కాల పరిమాణం చేయబడుతున్నది కనుక ఇది మాసమైంది.20 పున్నమినాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో దాన్ని బట్టి 370

వావిలాల సోమయాజులు సాహిత్యం-4