బ్రాహ్మణాల కాలము. ఋగ్వేదంలో ఎక్కడా కృత్తికలు నక్షత్రముఖంగా చెప్పలేదు.
సంహితాకాలంలో వాసంత విషువము సంవత్సరము కృత్తికతో ఆరంభించింది.
క్రీ.శ. 1377లో ప్రాంతంలో విషువము ధనిష్ఠలో ఉంది. ఇది వేదాంగ జ్యోతిష
కాలము. తరువాత ఐతిహాసిక కాలంలో విషువము శ్రవణంలో ఉండేది.
మహాభారతములోని విశ్వామిత్ర సృష్టి ఇందుకు నిదర్శనం.1 "అహః పూర్వం తతో
రాత్రి ర్మాసాః శుక్లాదయః స్మృతాః, శ్రవణాదీని నక్షత్రాణి, ఋతవః శిశిరాదయః”
దీనిని బట్టి మహాభారతము శ్రవణం నక్షత్ర ముఖంగా ఉన్న కాలంలో పుట్టి ఉంటుంది.
అంటే క్రీ.శ. 4వ శతాబ్ద ప్రాంతంలో శ్రావణ శుద్ధ ప్రథమ సంవత్సరాది అన్నమాట.
కానీ ఈ పరిగణనను అందరూ అంగీకరించి వ్యాప్తికి తెచ్చినట్లు తోచటం లేదు.
క్రీ.శ. 18 వ శతాబ్ది వరకూ ఇలాగే ఉంది. తరువాత అశ్విని నక్షత్రాది అయింది.
మేషంతో రాశి చక్ర మారంభించింది. చైత్ర శుద్ధ ప్రథమ సంవత్సరాది - అయినది.14
7
మన సంవత్సరానికి రెండు అయనాలు. ఉత్తరాయణము, దక్షిణాయనము
(Equinactical Points). వేదాంగ జ్యోతిష కాలంలో (క్రీ.శ. 1377 ప్రాంతము)
సూర్యుడు ధనిష్ఠ ప్రథమ పాదంలో ప్రవేశించగానే ఉత్తరాయణము. ఆశ్లేషార్ధగతుడు
కాగానే శ్రావణ మాసంలో దక్షిణాయమని తెలుస్తున్నది.17 " వరాహ మహిరాచార్యుడు
'సాంప్రత' మయనం సవితుః కర్కటకాద్యం మృగాడిత శ్చాన్యత్' అని చెప్పినాడు.
పునర్వసు చతుర్ధ పాదంలో దక్షిణాయనమని, ఉత్తరాషాఢ ద్వితీయ పాదంలో
ఉత్తరాయణమనీ దీని భావము. ఈ నాడు సూర్యుడు కర్కటకరాశి ప్రవేశించగానే
దక్షిణాయనము; మకరరాశిలో ప్రవేశింపగానే ఉత్తరాయణము.
8
మన సంవత్సరంలో షడృతువులన్నవి - అని వరుసగా వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్తు, హేమంతము, శిశిరము. దీనిని బట్టి ఋత్వాది వసంతమని మనకు అర్థమౌతున్నది. 'నూరు సంవత్సరాలు నన్ను బ్రతకనీ' అనటానికి 'నూరు హేమంతాల ఆయువీయి' అన్న అర్థాన్నిచ్చే మంత్రాలు కనిపిస్తున్నవి. అంటే ఒకానొక కాలంలో హేమంతము మొదటి ఋతువన్న మాట! వైదిక వాఙ్మయంలో ఋతువులకు సూర్యుడు కారకుడనీ, అవి మూడు, అయిదు, ఆరు, ఏడు, అనీ నిదర్శనాలు కనిపిస్తున్నవి.18 శతపథ బ్రాహ్మణాన్ని బట్టి ఋతువు లారని తెలుస్తున్నది. వసంత ఋతువున సంస్కృతి
369