"The ancient ary ans originally commenced their year, which was Luni
- Solar, and sidereal, with the Vernal Exquinox, and that when the beginning
was changed to the winter solstice both the reckonings were kept up, the
one for the sacrificial and the other for civil purposes.
12
తిలక్ మహాశయుడు భావించినరీతిగా ఆర్యులు చాంద్రసౌర సంవత్సరాన్ని
గ్రహించి వసంత చైత్రశుద్ధ ప్రథమతోనో కృష్ణ ప్రథమతోనో సంవత్సరాన్ని
ఆరంభించటానికే ముందు మరొక విషయాన్ని విద్వాంసు లూహించారు.13 వీరి
యభిప్రాయంలో కొన్ని వేలవేల యేండ్లకు పూర్వం నాక్షత్రమైన సౌరసంవత్సరం
ఒకటి ఉండి ఉండాలి. సూర్యుడు ఒక నక్షత్రంలో బయలుదేరి తిరిగి ఆ నక్షత్రానికి
రావటానికి పట్టేకాలము నాక్షత్ర సంవత్సరము. ఈ సౌరవత్సరానికి ఆరంభం ఎప్పుడో
చెప్పలేము.
తరువాతి కాలంలో మహా విషువంనాడు సంవత్సరం ఆరంభించి ఉంటుంది.
ఈ విషువము ఏటేటా 50 వికలలు వెనుకకు జరుగుతుంటుంది. 950 సంవత్సరాలకు
సుమారు ఒక వెనక ఔతుంది. విషువంతో సంవత్సరం ఆరంభించినప్పుడు ఆ నాడే
ఉత్తరాయణానికి, ఋతువుకు, మాసానికి, యజ్ఞానికి ఆరంభము.
14
భారతీయ సాహిత్యంలో కొంతకాలనుంచీ కలుగుతూ వస్తున్న మార్పులను
సూచించడానికి తగ్గ నిదర్శనాలు కనిపిస్తున్నవి. పునర్వసుకు నక్షత్ర దేవత అదితి.
ఆమెకు అన్ని యజ్ఞాలూ ఆమెతో ప్రారంభించి అంత మొందేటట్లు వరమున్నది.
సంవత్సరారంభంతో యజ్ఞాలు ఆరంభించటం ఆచారం కనుక ఇది ఒక
సంవత్సరారంభాన్ని సూచిస్తున్నదనీ, అదితి ఆదిత్యులకు తల్లి అనీ, ఆమె దేవయాన
పితృయానాలను ఏర్పరిచి ప్రథమ నక్షత్రంగా ఉన్నదనీ తెలియజేసే మంత్రాలు కనిపిస్తూ
ఉండటం ఈ అంశాన్ని బలపరుస్తున్నదని తిలక్ మహాశయుని అభిప్రాయం. ఈ
కాలానికి 'అదితి కాలము' (క్రీ.పూ. 6000 - 4000) అని నామకరణం చేసి,
అప్పుడు సంవత్సరము వాసంత విషువము దగ్గిర పునర్వసుతో గాని, దాని దగ్గర
గాని ఆరంభించి ఉంటుందని ఆయన నిర్ణయించాడు.
తరువాత కాలము మృగశిర కాలము (క్రీ.పూ. 4000 - 2500) ఈ కాలంలో
విషువము ఆర్ద్రలో ఉండేది. మృగశిరకు అగ్రహాయనమనే నామం ఉండటం వల్ల
సంవత్సరారంభం ఆ నక్షత్రంతో అయి ఉంటుందని తిలక్ మహాశయుని నిర్ణయము.
మూడవకాలము కృత్తికాకాలము (క్రీ.పూ. 2500-1400). ఇది తైత్తిరీయ సంహితా
368
వావిలాల సోమయాజులు సాహిత్యం-4