సంవత్సరానికి 360 దినాలైతే మాసానికి 30 దినాలు గల 12 చాంద్ర
మాసాలకూ కలిపి కొన్నాళ్ళు తగ్గింది. సౌర వత్సరంలో కొన్ని దినాలు పెరిగినవి.
రెంటికీ ఉన్న తేడాను మనవారు 10 ది. 21 గం. 20 ని. 30 సెకండ్లని నిర్ణయించారు.
మనవారు ఋతువులలో విస్పష్టంగా కనిపిస్తున్న సౌర సంవత్సరాన్ని
వదులుకోలేక పోయినారు. మరొక వంక శుక్ల కృష్ణ పక్షాలతో చాంద్రమాసము (Lunar
month) కనిపిస్తుంటే దాన్నీ వదులుకోలేక చాంద్ర - సౌరవత్సరాన్ని స్వీకరించారు.
5
యజ్ఞప్రియులైన ప్రాచీనార్యులకు తిథి, మాస, ఋతు, అయన పరిజ్ఞానము
అత్యవసరమైంది. అందువల్లనే ఒక జిజ్ఞాసువు 'జ్యోతిష్య శాస్త్ర దృష్టితో చూస్తే యజ్ఞము
కాలాన్ని కనుక్కోవటానికి ఏర్పడ్డ పరిశోధనాగారమని భావించారు. యజ్ఞం సంవత్సరం
పొడుగునా జరుగుతూ ఉండటం వల్ల యజ్ఞం, సంవత్సరము అనే రెండు పదాలు
ఏకార్థసూచకాలైనవి.' 'సవన'మనే శబ్దానికి సోమరస సంధానమని అర్థము. ఇది
యజ్ఞము. దీనిని బట్టి సావన దినము, మాసము, సంవత్సరము అను వ్యవహారం
కల్గింది. కాని 30 సావన దినాల మాసము చాంద్రమాసానికి ఎక్కువ. చాంద్ర మాసము
ది. 29 1/4 తో అయిపోతుంది. దీనిని బట్టి పన్నెండు నెలలకు 6 దినాల తేడా
వస్తుంది. చాంద్రమాసాలకు ఋతువులకు ఐక్యాన్ని సరిపెట్టటానికే మనవారు అధిక
మాసాన్ని కల్పించారు. ఋతుభేదాన్ని పాటించకుండా చంద్రునితో సరిపెట్టుకుంటూ
ముసల్మాన్ సోదరులలాగా పోతే, మన వ్యవసాయపు పనులలోనూ, దేవపూజ, నిత్య
పూజాల్లోను చీకాకు కలుగుతుంది. 360 తిథులను సిద్ధాంతులు 354 దినాలలోకే
సర్ది, అవసరాన్ని బట్టి అధిక మాసాలను చేరుస్తూ పంచాంగాలను సవరణ చేస్తూంటారు.
ఆంధ్రదేశంలో చాంద్ర సౌర భేదాల చేత సంవత్సరం రెండు విధాలుగా
ఉందని పైన గమనించాము. అమావాస్య నుంచి అమావాస్యకు ఉన్న కాలం
చాంద్రమాసం. పన్నెండు చాంద్రమాసాలు ఒక చాంద్రవత్సరం. సూర్యుడు మేషాది
రాశిచక్రాన్ని తిరిగి రావటానికే పట్టే కాలం సౌరసంవత్సరం. ఈ సౌరవత్సరం సాయన
నిరయన భేదాలతో ద్వివిధంగా ఉంది. మేషాయనం (మార్చి 20) నుంచి మేషాయనం
వరకు పట్టేకాలం సాయన సంవత్సరం. మేష సంక్రమణం (ఏప్రిల్ 13) నుంచి
మేష సంక్రమణం వరకు అయ్యేకాలం నిరయన సంవత్సరము. ఆంధ్రుల సంవత్సరం
చాంద్రమాసాలవల్ల కలగటం చేత ఆంధ్రుల సంవత్సరం నేడు నిరయన సంవత్సరము.
366
-
వావిలాల సోమయాజులు సాహిత్యం-4