పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/364

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమే భానువాసరే...' ఇత్యాదిగా చెప్పుకుంటారు. దీనినిబట్టి మనవారు మనకు ఎటువంటి కాల స్వరూపాన్ని ఏర్పరచింది, దాన్ని మనం ఎలా నిత్యజీవితంలో వినియోగించుకుంటున్నదీ వ్యక్తమవుతున్నది.

మనకు నేటి సంవత్సరాదితో ఆరంభమయ్యే జయనామ సంవత్సరం నాటికి చతుర్విధమానాలు ఈ రీతిగా గడిచాయి. సృష్ట్యాదిగా గడిచిన సంవత్సరాలు 1655885054. జయతో 1655885055 ప్రారంభమైంది. ఇప్పటి బ్రహ్మకు ద్వితీయ పరార్ధము. ఆయన 50 సంవత్సరాలు గడిచి ఏబది ఒకటో సంవత్సరం మొదటి దినం జరుగుతున్నది. ఈ దినానికే కల్పమని పేరు. మొదటి దినం కనుక శ్వేత వరాహకల్పము. మొదటి దినంలో పగటివేళ ఘ 13 వి. ఘడియలు గడిచినవి. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, చాక్షుస, రైవత, వైవస్వత, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి - ఈ పదునాల్గురు మనువుల్లో ఆరుగురి మన్వంతరాలు గడిచిపోయినవి. ఏడవ దైన వైవస్వత మన్వంతరంలోని డెబ్బది మహాయుగాలలో ఇరువది ఏడు గడిచిపోగా, ప్రస్తుతము నడుస్తున్న 28వ మహాయుగంలోని చతుర్యుగాలలో కృత, త్రేత, ద్వాపరాలు అయిపోయినవి. నాల్గవ దైన కలియుగంలో ప్రథమ పాదం నడుస్తున్నది. '
4 కలియుగానికి 4,32,000 మానవాబ్దాలు. అందులోని ప్రథమ పాదంలో జయనామ సంవత్సరం నాటికి 5054 గడిచిపోయినవి. జయతో 5055 ప్రవేశించింది. ఇక కలిలో శేషాబ్దాలు 426945.
ప్రతి అరవై సంవత్సరాలకూ ప్రభవాది నామాలు చెల్లుతూ ఉండటం ఆంధ్రులందరికీ తెలిసిందే. ఈ అరవై సంవత్సరాల ప్రమాణం దేవతలకు ఒక ఋతువు.
ఈ అరవై సంవత్సరాలల్లో జయ, ఇది చాంద్రమానాన్ని బట్టి. సంవత్సరాల సంఖ్యను చెప్పుకోటానికి అన్ని దేశాలలోను, ఏదో ఒక అబ్దం ఆచారంలో ఉంది. మన దేశంలో ఇటువంటివి షటకాలున్నట్లు తెలుస్తున్నది. అవి 1. యుధిష్ఠిర శకము. 2. విక్రమార్క శకము 3. శాలివాహన శకము 4. విజయాభి నందన శకము 5. నాగార్జున శకము 6. కల్కి శకము. యుధిష్ఠిర విక్రమార్కశకాల మధ్యకాలంలో భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలోనైనా సప్తర్షియుగము, మహేశ్వరాబ్దము వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రాచీన భారతదేశంలో స్వర్ణయుగాన్ని కల్పించిన గుప్తుల పేర ఒక శకం కన్పిస్తున్నది. పూర్వపు ఒరిస్సా 364

వావిలాల సోమయాజులు సాహిత్యం-4