పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/363

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇటువంటి చతుర్యుగాలు లేక దేవయుగం బ్రహ్మకు ఒక దినం (పగలు) రాత్రికూడా అంతే. ఈ కాలానికి 71 రెట్లు మన్వంతరము. అంటే మన డెబ్బది ఒక్క చతుర్యుగ కాలాలు మనువుకు కాలనియతి అన్నమాట. మానవ కాలపు ప్రమాణంలో ఇది 30,67,20,000 సంవత్సరాలు. పదునలుగురు మనువుల కాలం 4,29,40,80,000 మానవ సంవత్సరాలు. వీటన్నిటినీ బట్టి బ్రహ్మమానం క్రింది రీతిగా ఉంటుంది.
14 మన్వంతరాలు లేక 1000 మహాయుగాల కాలము

మానవాబ్దాలలో

14 మన్వంతరాలు లేక 1000 మహాయుగాల కాలము
42,94,08,000

6 మహాయుగాల సంధికాలము
2,39,20,000

బ్రహ్మకు పగటికాలము సృష్టికల్పము
4,32,00,00,000

బ్రహ్మకు రాత్రి కాలము ప్రళయకల్పము
4,32,00,00,000

బ్రహ్మకు అహోరాత్రమైన దినము (బ్రహ్మకల్పము)
8,64,00,00,000

30 కల్పముల బ్రహ్మ మాసానికి
2,59,20,00,00,000

12 కల్పాల బ్రహ్మ సంవత్సరము
31,10,40,00,00,000

100 సంవత్సరాలు బ్రహ్మ కాయుః ప్రమాణము
31,10,40,00,00,00,000

ఇది బ్రహ్మ మానము. శత సంవత్సరాలున్న బ్రహ్మ పరమాయువుకు మన ప్రాచీనులు 'పర'మని సంజ్ఞ కల్పించారు. ఈ పరానికి రెండు అర్థాలున్నవి. అర్ధానికి బ్రహ్మవత్సరాలు ఏబది.

3

ఈ కాలమానంతో మన ప్రాచీన భారతీయులు బహుకాలం తమ నిత్య నైమిత్తిక కామ్యకర్మలను జరుపుకున్నారు. ఈ నాడు కూడా శుభాశుభకర్మల్లో మనం ఈ మానాన్ని అనుసరిస్తున్నాము. ఈ జయనామ సంవత్సరాదినాడు సదాచార సంపన్నులు ప్రాతః స్నాన సంకల్పం చెప్పేటప్పుడు "శ్రీమహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భారతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్... అస్మిన్ వర్తమానేన జయనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతే చైత్రమాసే శుక్లపక్షే సంస్కృతి 363