ఈ పుటను అచ్చుదిద్దలేదు
కలిగింది. కావచ్చును. వ్యాసుడు కొంతకాలం శిష్యవర్గంతో వారణాసిలో ఉండటం
వల్ల దానికి అంతటి ప్రశస్తి కలిగిందని కూర్మ పురాణం పలికింది.
వ్యాసుడు : వాల్మీకి
వాల్మీకి సామవేద ప్రోక్త. ఆయన “నిషాద క్రౌంచపక్షి వృత్తాంతాన్ని చూచి,
‘వైదిక అనుష్ఠుప్' ఛందాన్ని కొంత మార్చి, రామాయణ మహాకావ్య నిర్మాణం చేశాడు.
కాని ఇతిహాసము గేయరూపకంగా ఉండకూడదు. వైదిక కర్మోపయుక్తంగా వ్యాస
భగవానుడు ఆయా కర్మలననుసరించిన అర్ధవాదాలకు అనుగుణమైన ఇతిహాసాన్ని
వ్రాసి అశ్వమేధ యాగానికి యుక్తంగా నడిపించినాడు. అందువల్ల మహాభారతము
జయము. అందువల్ల ఆయన భారత ధర్మాచార్యుడైనాడు. వాల్మీకి రామాయణాన్ని
కుశలవులచేత పాడించి యిహంలో వ్యాప్తి పొందించినట్లే, వ్యాస భగవానుడు
వైశంపాయనాది శిష్యుల ముఖాన సమస్త రచనలనూ ప్రచారం చేయించారు.
భారతి - వ్యయ, ఫాల్గునము పే. 107-211
360
వావిలాల సోమయాజులు సాహిత్యం-4