కలిసి వేదాధ్యయనం చెయ్యమని చెప్పి వెళ్ళిపోయినాడట! ఆయన ఒక్కొక్క విద్య ఒక
శిష్యుని మూలంగా లోకంలో వ్యాప్తి పొందించిన గురుదేవుడు, పరమయోగి, త్రికాలవేదీ.
ఈ సమస్తశక్తినీ తపస్సంపన్నతవల్లనే ఆ మహానుభావుడు పొందగలిగాడు.
ముందెందరు వ్యాసులో జన్మించినా, వారందరూ చేయలేని పనిని కృష్ణద్వైపాయనుడు
ఆ శక్తివల్ల చేయగలిగాడు. అందుకనే అశ్వఘోషుడు బుద్ధచరిత్రలో "వశిష్ఠుడూ, శక్తి
ఏ పనైతే చేయలేదో ఆ వంశంలో జన్మించిన వ్యాసుడు దానిని చేశాడు; అతడు
సారస్వత వ్యాసుడు" అన్నాడు (బుద్ధ చరిత్ర -48).
వైదిక సాహిత్యంలోనూ, పురాణాలలోనూ కనిపించే ఋషి వంశాల్లో వ్యాస
వంశము దొడ్డది. వ్యాసుడు వశిష్ఠునంతటివాడు. ఆయన బ్రహ్మ సూత్ర రచన చేసిన
బ్రహ్మజ్ఞాని. భారతీయ విజ్ఞాన గ్రంథకర్త కావటం వల్ల గ్రంథ పీఠం వ్యాస పీఠమైంది.
వ్యాసమహర్షి భారత జాతిద్రష్ట, సారస్వతస్రష్ట, దేశంలో ధర్మం లుప్తమైనప్పుడల్లా
'జాగృతి' పొందటానికి దివ్య తేజస్సుతో జయగ్రంథసాగరంలో భాసించే మహోజ్వల
మణిదీపం. అది గురుదేవుడు.
ఆయన పూజ గురుపూజ
తన్నప్తే చాతియశసే జాతూ కర్ణ్యాయ చర్షయే వశిష్ఠా యైన శుచయే కృష్ణద్వైపాయ
నాయ చః
అని ఒకచోటా, మరొకచోట
"తస్మై భగవతే కృత్వా నమో వ్యాసాయ వేధసే! | పురుషాయ పురాణాయ
భృగువాక్య ప్రవర్తినే ॥ మానుషశ్చ... విష్ణవే ప్రభవిష్ణవే జాత మాత్రం చయం వేద
ఉపతస్థా ససంగ్రహః ॥ ధర్మమేవ పురస్కృత్య జాతూకర్యాదవాప తమ్ | మతి మంధాన
మావిధ్య యేనాసౌ శ్రుతి సాగరాత్ ॥ ప్రకాశో జనితో లోకే మహాభారత చంద్రమాః |
నేదద్రుమశ్చయం ప్రాప్య సశాఖః సమపద్యత ॥" అని కనిపిస్తున్నది.
వ్యాసాశ్రమము
మహాభారతం శాంతిపర్వంలో 'గురో ర్మే జ్ఞాననిష్ఠస్య హిమవత్పాద ఆస్థితః'
అన్న వాక్యం వల్ల, ఆయన ఆశ్రమం హిమవత్పాద ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.
దీనికి “బదరిక” అనే నామం కూడా వ్యవహారంలో ఉంది. అది బాదరాయణుని వల్ల
సంస్కృతి
359
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/359
ఈ పుటను అచ్చుదిద్దలేదు