పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/358

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పురాణాలను వ్యాసభగవానుడు ప్రవచించాడు. అయినా సమస్త భారత విజ్ఞానాన్నీ ఒకచోట క్రోడీకరించవలసిన అగత్యం కనిపించినది. అప్పుడు 'ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విదులు వేదాంత మనియు, కవివృషభులు మహాకావ్యమని...” ఈ రీతిగా భావనకు యోగ్యమైన భారతాన్ని పలికాడు. భారత రచన పురాణ రచనాంతర మైనట్లు 'అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీ సుతః భారతాఖ్యాన మఖిలం చక్రే తదుపబృంహితమ్' అన్న మహాభారతంలోని (53-70) శ్లోకం వల్ల వ్యక్తమౌతున్నది. ఈ వ్యాసుడు సత్యవతీసుతుడని అంగీకరిస్తే, వ్యాసునకు 1000 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తం క్రింద కొందరు వ్యాసకృతంగా అంగీకరించలేదు.

వ్యాసుడు - గురువు ద్వైపాయనుడు బాల్యంనుంచీ మహావిద్వాంసుడు. అనూచానంగా వస్తూ వున్న ఆచారం ప్రకారం వేదశాస్త్రాలను అధ్యయనం చేశాడు. వైదిక సాహిత్యంలో వ్యాసుడు విష్వక్సేనుని శిష్యుడని కనిపిస్తున్నది. పౌరాణిక వాఙ్మయంలో ఆయన జాతుకర్ణి శిష్యుడు. వాయుపురాణం ప్రథమాధ్యాయంలో
బ్రహ్మ వాయు మహేంద్రోభ్యో నమస్కృత్య సమాహితః | ఋషీణాం చ వరిష్ఠాయ వశిష్ఠాయ మహాత్మనే || వ్యాస శిష్యులు
వ్యాసాశ్రమంలో ఆయన శిష్యులు నలుగురు - సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు, జైమిని, వ్యాసుని పుత్రుడు శుకుడూ ఉండేవాళ్ళు. తండ్రి ఆజ్ఞానుసారంగా శుకుడు సాంఖ్యశాస్త్రం తెలుసుకోటానికి వెళ్ళిపోయినాడు. నలువురు శిష్యుల వేదాధ్యయనమూ పూర్తి అయిన తరువాత వ్యాసభగవానుడు అన్నాడు :
"భవంతో బహుళా సంతు వేదో విస్తార్యతామ్”
- ('మా శిష్యప్రశిష్యుల మూలంగా లోకంలో వేదం బహుముఖాల వ్యాప్తి పొందుగాక!' శిష్యులు శైలకానన ద్వీపాలను లెక్కచేయకుండా వేదవ్యాప్తికి వెళ్ళిపోయినారు. నారదుడు వచ్చి "మీ ఆశ్రమంలో వేదాధ్యయనం వినిపించటం లేదు. మీరు ఏదో ఏకాంతంగా చింతాక్రాంతులైనట్లున్నా” రన్నాడు. ఆయన శిష్యవాత్సల్యం అపారం కావటం వల్ల అలా ఉన్నప్పుడు, మహర్షి నారదుడు శుకునితో 358 వావిలాల సోమయాజులు సాహిత్యం-4