పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది




తే. గడుపునిండినఁ గసికాటు కఱచునవియు
     గూడి యొండొంటితోఁ జెఱలాడు నవియు
     నగుచు వెన్నెల తమ సొమ్మె యనిన యట్లు
     కోరి చరియించెఁ జదలఁ జకోరచయము

అని యందలి విభేదముల వీనులలర వినిపించినాఁడు. కౌముదీమహోత్సవములతోఁ బాటు మదనోత్సవములును జరుగుచుండుట భారత రసిక లోక మెఱిఁగినదే. 'కొలము సాముల నందఱఁ గూడఁ బెట్టి చిగురు విలుకాని జాతర సేయువేళఁ జకోరపుఁ బేరటాండ్రు :

సీ. [1]విరహుల మైసోకి వేడియౌ వెన్నెల
            బచ్చి వెన్నెల నులివెచ్చఁ జేసి
     కలువ పుప్పొళ్లచేఁ గసటైన వెన్నెల
            వలిపవెన్నెలలోన వడిచి తేర్చి
     చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల
            ముదురు వెన్నెల జుట్టఁ బదును చేసి
     సతుల మైపూఁతం బిసాళించు వెన్నెలఁ
            దనుపు వెన్నెల రసాయనము గూర్చి

వంతుగలియఁగ బువ్వంపుబంతివిందుఁ బెట్టుట లొక మహాకవి దర్శించి చకోరకులముల యన్నరసాస్వాదనా శేముషికి జోహారు లర్పించినాఁడు.

ఒక మహాకవి కౌముదీ మహోత్సవమున కాదంబరీ పాన మదఘూర్ణిత నేత్రయై గోత్రమునం దున్న యొక యుజ్జ్వలవిలాసిని యున్మతయై పల్కిన “చంద్రా! ఏల యీ సురాచషకమునఁ బ్రతిఫలింతువు? రోహిణీదేవి ధమ్మిల్లముతోఁ బాటు విరుల నెత్తానికి వీడ్కోలు సుమా! ద్విజరాజువై యుండి యీ మధువుతో నీకేమి పని? మద్యముతోఁ బాటె నిన్నును ద్రాగి వైచెదను. మా యందెవ్వరినో కామించి యిట్లు తట్టాడు చున్నట్లున్నావు. ఇది నిజము. లేకున్న నీపై నీ తారకల కనుమానమెందులకు? వారు నిన్నేల యనుసరింతురు? పశ్చిమ దిశను నీకెవరో ప్రణయిని యున్నట్లున్నది; కాదేని నిశాంతమున నీ నా దెస కేల పయనింతువు?" అను ప్రలాపముల వీనులలర విని రసానందానుభూతి నొందినాఁడు.

చంద్రునకు నూలుపో గర్పించు వేళ నొక భావుకుఁడిట్లు దర్శించి

మ. [2]చరమక్ష్మాధరసింహచారుము ఖదంష్ట్రాకోటియో నాఁగ నం
    బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేభ ప్రస్ఫురద్గర్వసం

  1. 53. విరహుల మైసోకి - పారిజా. ఆ. 2. ప. 49
  2. చరమక్ష్మాధర - శ్రీనాథ యుగమందలి మఱియొక కవిసార్వభౌముఁడు రావిపాటి
    త్రిపురాంతకుని 'చంద్రతారావళి' నుండి (ప్రబంధరత్నాకరము 173)

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

35