పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/247

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అది ఉన్నప్పుడు సంతోషిస్తున్నారు. కానీ వైవాహిక జీవనంలో ఉద్వేగానికి విశేష ప్రాధాన్యం ఉన్నది. ఇరువురిలోనూ ఒకేవిధమైన ఉద్వేగమూ, ఆదరాభిమానాలూ ఉన్నా కొన్ని సందర్భాలలో వివాహం విజయవంతమైనది కావటం లేదు. కళాకారుల వివాహాలు సర్వసామాన్యంగా ఇటువంటివి. కళాజీవి సర్వసామాన్యంగా తాను కళకోసం జీవిస్తున్నాననుకుంటాడు. కళావేశం కలిగినప్పుడు ప్రియపత్ని నైనా తోసి రాజంటాడు. ఇరువురూ కళాకారులై అన్యోన్యమైన భావోద్వేగాలను అవగతం చేసుకుంటే తప్ప, సర్వసామాన్యంగా వారి జీవితం వైవాహికంగా విజయవంతమైనదని చెప్పటానికి వీలుండదు. కేవలం తన మానసికోద్వేగాలను అనుసరించి ఆనందాన్ని పొందే వ్యక్తి సహచరికి వైవాహిక సౌఖ్యముండని మాట వాస్తవము. ఇటువంటి స్త్రీలును ఉండవచ్చును. బార్నిస్ 'జాతి, నేస్తము, వివాహము' అనే గ్రంథములో 'స్త్రీ జాతిలోని ఒకానొక అదుపాజ్ఞలు కలిగిన మానసికోద్వేగకు ఆ వైవాహిక విజయానందము శూన్య’మని ఈ విధంగా అభిప్రాయపడ్డాడు :

“The most dangerous type of female flirt is the beauty who uses every kind of art of attraction, accepting all the tributes that her admirers offer; leading men to believe that she is being ensnared but withdrawing safely and retaining her physical Purity' and inviolability each time. She is often for sale to the highest bidder, but she is sometimes only an abnormally cold and permanently immature person who cannot make a success of any kind of marriage” అని అతని అభిప్రాయము.

స్త్రీ మానసికోద్వేగానికి నేటి వైవాహిక జీనవంలో కించిత్తయినా గౌరవం లేదు. సర్వసామాన్యంగా స్త్రీ మానసికోద్వేగం అతి అనాగరక స్థితిలో స్వామిత్వవాంఛ (Possessiveness), ఈర్ష్య ఇత్యాదులు అధికము. సృజనావిధానంలో ఆమె వీటిని మరిచిపోతుంటుంది. ఆమెకు తగిన సృజనోద్వేగవాంఛ తీరకపోవటంవల్ల కూడా వైవాహిక జీవనానికి ఆనందం ప్రాప్తించదని ఒక వేత్త అభిప్రాయము. మానసికోద్వేగము తీరని ఆధునిక స్త్రీలు కొందరు నవోఢలతో అధిక స్నేహము (Unisexual Love) చేస్తున్నట్లునూ, అందువల్ల విశేష ప్రమాదములు సంభవిస్తున్నట్టు తెలుస్తున్నది. తమతో సమానమైన మానసికోద్వేగమూ, విజ్ఞానమూ కల పురుషుని కాని వరింపమని అన్వేషణ చేస్తున్న అనేకమంది ఆధునిక కన్యకలకు ఏదో విధమైన సృజనావృత్తు (Creative occupations) లతో సంబంధము కలిగి ఉండటము అవసరమనీ, అందువలన వారికి శారీరకమైన అవకాశాలేమిటో, వాటినుండి ఏ విధంగా బయటపడవలసి ____________________________________________________________________________________________________

సంస్కృతి

247