పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16. J.R.A.S. October 1930 pp - 930 -932

17. చతుష్షష్టి కళలు కామసూత్రములకు అంగవిద్యలని వానిని మహర్షి వాత్స్యాయనుడు సంగ్రహించినాడు. ఇవి ఇతర శాస్త్రములందును చెప్పబడి ఉన్నవి. కల్పసూత్రములలో కళలు డెబ్బదిరెండుగ నున్నవి. జైన గ్రంథము లందును నట్లే యున్నవి. కామసూత్ర వ్యాఖ్యాత ఈ అరువది నాలుగు మూలకళలయందే గర్భితములైయున్న అంతరకళలను మరికొన్నిటిని చేర్చి కళలు పంచశతములని చెప్పినాడు. వానిని కర్మాశ్రయములు (24), ద్యూతాశ్రయములు (20), శయనోపచారకములు (16), ఉత్తర కళలు (4) అని విభజించి వాని స్వరూపము రూపించినాడు. వాత్స్యాయనుని చతుష్షష్టి మరియొకటి ఉన్నది. మహర్షి, వ్యాఖ్యాత లిరువురు ఆ పాంచాలికా చతుఃషష్టిని గూడ కామశాస్త్రమున కంగవిద్యలుగా పరిగణించినారు. భోజుని చతుష్షష్టి మరొక విధముగ నున్నది. ప్రాచీన గ్రంథములను బట్టి కళలన్నియును తెలియకున్నను సుందరమైన ప్రతికర్మను మనవారు కళగా లెక్కించిరని చెప్పవచ్చును.

18. కామసూత్రములు - (1.4.42) ఇందలి యక్షరాత్రి, కౌముదీ జాగరము, సువసంతకము, యవన చతుర్థి, అలోల చతుర్థి, మదనోత్సవములు, కేవలము పురాతన గ్రీకుల కోర్డాక్సు నృత్యము, హేస్టీయా దేవపూజల వంటివి కావు. బొనాడియా, డైయినీషియస్, మొదలైన రోమక దేవతాపూజలలోని బుకనేలియా ఉత్సవముల వంటివి కావు. ఇందలి హోలాకా, అశోకొత్తంశికా, ఇక్షుభంజికాది క్రీడలు గ్రీకు రోముక దేశముల కామోన్మత్త వృత్తములతో పోల్చదగినవి కావు. ఉదకక్ష్వేడిక అను శృంగాటకము గిబ్బను మహాశయుడు విపులముగ వర్ణించిన ప్రజాస్నానద్రోణ జలక్రీడల పోలవు. (History of tho Decline and Fall of the Roman Empire Vol. V)

19. 'ఏకచారిణశ్చ విభవ సామర్థ్యా ద్గణికాయాం నాయికాయాశ్చ సఖౌభి ర్నాగర కైశ్చ సహచరిత మేతేన వ్యాఖ్యాతమ్' (1.4.43) అనుటను బట్టి ఏకచారులగు వారును విభవసామర్థ్యములను బట్టి సమస్త క్రీడలను ప్రవర్తించెడివారని తెలియుచున్నది.

20. పునర్భువును 'పునర్బూరియం అన్య పూర్వక రుద్దా నాత్ర శంకాస్తి' అని నిరూపించి పూర్వము క్షతయోనియై మరల వివాహమాడుటవలన నట్టి స్త్రీ నధిగమించుట వలన ధర్మపీడగాని, తదాశంక గాని లేదు (1.5.7) అని చెప్పుటవలన పునర్వివాహ విషయమున వాత్స్యాయనుని అభిప్రాయమేమో వ్యక్తమగుచున్నది. ఆమెకు ధర్మపత్నీత్వమును అతడంగీకరించినట్లు తోచదు. పునర్భూ సమాగమమునకు తరచుగ కలుగు కారణములను ఈ అధ్యాయమున 6-20 గల సూత్రముల విశేష బుద్ధికుశలతను ప్రకటించి మహర్షి విశదీకరించినాడు. ____________________________________________________________________________________________________

162

వావిలాల సోమయాజులు సాహిత్యం-4