పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/155

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీరవలసినదే. అటుల యోగ్యుడైన వరుడు లభించని పక్షమున నామె శాస్త్రోక్తముగ నొక వృక్షమునకు గాని, ప్రతిమకుగాని, కౌక్షేయకమునకు గాని వివాహ మొనర్పవలెను. వివాహము కాని మధ్యవయస్కుడైన బ్రహ్మచారితో సహపంక్తి భోజనము పనికిరాదని స్మృతి వాక్యమున్నది. వారి వివాహమునకు ప్రథమ కారణము 'కుమారుని మూలమున పితృతర్పణము' ప్రాచ్యఖండములు వివాహము, మృత్యువు రెండును దైవకార్యములని భావింతురు. వీటన్నిటిని బట్టియును ప్రాచ్య దృక్పథమును బట్టియు హిందూవివాహము కేవలము న్యాయసమ్మత (Legal) పరస్పర ప్రేమానురాగ బంధముల (Mutual Sexual unions) కంటే విశేషమైనదని అర్థము కాగలదు. అందువలన ప్రాచ్యఖండములలోని వైద్యశాస్త్రజ్ఞులు, ధర్మశాస్త్రకర్తలు, సాంఘిక శాస్త్రవేత్తలును కన్యావరణమునకు ఎన్నో నియమముల నేర్పరచినారు. ప్రాచ్యదేశ ములందును కేవలము సహకారులుగ నుండుటకు మాత్రమే ఇట్టి నియమములు కొన్ని వారి పూర్వులు పలికినారు. అందలి అనేక నియమములు ప్రాచ్యదేశ వరణనియమములును ప్రధానముగ భారతీయ వరణవిధులతో సరిపోవుచున్నవి.


భారతీయ వివాహ లక్షణవేత్తలు రూపమునకు విశేష ప్రాధాన్య మిచ్చినట్లు కనుపింపదు. ఆ రూపమును వ్యక్తిగత, దేశగత, జాతిగతము. జాతులను సంరక్షించుకొనుటకు ఆవశ్యకములైన శరీర ధర్మమును (Biological means of race preservation) వారు విశేషముగ కోరినారు. నేటి మానసిక శాస్త్రవేత్తలును మరియొక రీతి స్త్రీ భాతృపితృ సమానులను, పురుషుడు మాతాభగినీ సమానలను వరించుట సహజముగ గోచరించునని చెప్పినారు అందుమూలమున ఒకానొక వేత్తయన్న క్రింది వాక్యము లెంతయో సమంజములైనవి

“The Hindu Theologians have all along believed that marital partners are pre - ordained by God; where as the Freudian science admits that they are unconsciously pre - ordained by the children themselves, who alone can make a marraigae happy or unhappy."

ఒకటి సత్యము. భారతీయ వివాహము న్యాయానురాగ బంధములకంటె నధికమైన దగుటచే విచ్ఛేదవిరహితము.

కన్యయందు కోరదగిన లక్షణములు కొన్నిటిని మహర్షి వాత్స్యాయనుడు నిరూపించినాడు. వాటిని కల్యాణమల్ల కొక్కోకులు వారి కాలమునకు అనుగుణములుగ, నాటి అభిమానములతో పెంపొందించినారు.


సంస్కృతి

155