పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

claws) (7) శశప్లుతకము (Poping of the Hare) (8) ఉత్పలపత్రకము (Lotus Petal) ఇందు రేఖ నెటనైన ప్రయోగింపవచ్చునని వాత్స్యాయనుని మతము. కేవలము చేతులు, తొడలు, స్తనములు, గుహ్యాంగము (Mons Veneris) నందును మాత్రమేనని అనంగరంగకర్త. వాత్స్యాయనుని వ్యాఘ్ర నఖస్థాన ములకు భిన్నముగ నాగరసర్వస్వకర్త తొడలు పిరుదులపై ప్రయోగింప వచ్చుననినాడు. ఉత్పలపత్రము విషయమునను కామసూత్రకర్తకును, అనంగరంగకర్తకును అభిప్రాయభేదమున్నది. అంతమున 'ఆకృతి వికార యుక్తాని చాన్యావ్యపి కుర్వత' (2.4.23) అని అనురాగము నేర్పు ననుసరించి నఖాదానమొనర్పవలెననియును, ఇందు చెప్పిన వికల్పములు మాత్రమే కాక అనంతభేదమున్నదని యను పూర్వాచార్యుల మతమైనట్లు పలికినాడు. (2.4.24) రాగ సంజననము కొరకు వైచిత్య్రమును అపేక్షించుట లోకసహజ మగుటవలన నఖాదానములొనర్చినను పరదారల విషయమున రహస్య ప్రదేశములందు మాత్రమే ప్రయోగింప వలెనని చెప్పినాడు. (2.4.26) నఖక్షత దేహములు స్త్రీ పురుషుల కిరువురకును రాగవర్ధకములని ఆయన నిశ్చయము - అందువలననే ప్రాచీనులు 'సహసా నఖంపచ స్తన దత్త పరిరంభ' సంభోగులైనారు. వేశ్యలు 'గరజలేఖాలంకృత కుచయుగళ' లైనారు.


దశనచ్ఛేద్యమును (Morsification) అతి గాఢమైన చుంబన విధానముగ పాశ్చాత్యులు పరిగణించినారు. 'రదనములు పెదవులను ఒకచోట చేర్చుటకే కాక అవి ప్రీతి నచుంబన సమయముల రాగవృద్ధికరములుగ నుపకరించు చున్నవి. సంప్రయోగమున ప్రధాన అప్రధాన పాత్రలు (Active and Passive Partners) ఇరువురును నిశితములు, మధురములు అయిన రదనచ్ఛేద్యముల మూలమున శృంగారకానందము (Erotic Pleasure) ను పొందుదురు. కాని అట్టివారిని ఒకదాని వెనక ఒకదాని పరస్పరము ఏకస్థానీయము అగునట్లు ప్రయోగింపవలయును. నాయికా నాయకులు భావప్రాప్తి అత్యున్నత స్థాయిని పొందినప్పుడు వారు దంతముల నుపయోగించుదురు. అట్టి సమయముల వారికి ఎట్టి క్రియలును వైపరీత్యము (Abnormal గ తోచవు' అని ఒక ఆధునిక శాస్త్రజ్ఞుడు దంతక్షత ఆవశ్యకతను గూర్చి పలికినాడు. మరికొందరు శాస్త్రజ్ఞులు దీనిని వైపరీత్యముగ నెంచుటమాని, ఒక మతము దంతక్షతాదాన సహన గుణములు వివాహితులకు కొంతవరక వసరమనియు చెప్పుచున్నారు. అన్య శాస్త్రకారాదృష్ట అధ్వగుడైన వాత్స్యాయనుడు రదనచ్చేదావశ్యకతను, కామతంత్రమున తత్థానమును గమనించి నిరూపించినాడు. జయమంగళకర్త 'ఆలింగనాదయో దేశ ప్రవృత్తి, మనిరూప్య ప్రయుజ్యమానా నరాగ


{rh|సంస్కృతి||137 }}