పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది


తే. ఎవరిఁ గనుఁగొన్న నేమిటో యెఱుఁగ నమ్మ!
    యేను ఋణపడి నట్లుగా నెంతు రేల ?
    రక్తమును బిండి యిచ్చిన రక్తిఁ గొనని
    చెడుగు సాహుల కడ నప్పుఁ జేసినామె!
   
తే. అమ్మ! అపుడు నీ వేఁగినయంతనుండి
    చిన్ని మనతోఁటలోనఁ దోఁచినవి మూఁడు
    లేగులాబీలు; ఏ రేయొ యేఁగుదెంచి
    విరిసి వాసనలలమ దీవించి పొమ్ము!
   
తే. అప్పు డప్పుడు స్వప్నాల నవతరిల్లి
    మనసుపడి నీదు మనుమల మనుమరాండ్ర
    నెత్తి ముద్దాడి శీలమ్ము నింతనేర్పి
    యరుగు మోతల్లి ! యదియె మా కౌను మేలు.
    
తే. సప్త సంతానములఁ గృతి శాశ్వతంబు
    స్వర్గసౌఖ్యప్రదం బన్నపలుకు నమ్మి
    యమ్మ! నీ కిచ్చుచున్నాఁడ నంకితమును
    జెప్పి స్వర్గనిత్యనివాససిద్ధి కొఱకు.
    
    

12