పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/749

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రహ్మాయువు నివసింపవలెను. మంగళుఁడు ఛన్న విహారములో నేకశృంగ విజితావులతో నుండవలెను.

కొలది కాలమునకే మంగళునికి, శాతకర్ణికి మధ్య మనస్పర్ధలేర్పడినవి. ఇరువురకును మిత్రులైన విద్యార్థులెంత యత్నమొనర్చిననవి సమసిపోలేదు. తన పేదఱికమును శాతకర్ణి విద్యాలయములో నందఱకును వెల్లడించినాడని మంగళుని యనుమానము. కాని శిఖి యేమియు నెఱుగడు. లేకున్న విజితావికెట్లు తెలిసినది? ఏమైననేమి?

తల్లియెడ మంగళుని ప్రవర్తనము శాతకర్ణి కణుమాత్రమును నచ్చలేదు. ధైర్యముతో నామెను మన్నింప నేర్చుకొనుమని యతనికి జెప్పినాడు. ఇంతకు బూర్వము శాతకర్ణికి మంగళుఁడు పరమమిత్రుడు. నేఁడాతనికి ధ్వజకేతువు ప్రథమమిత్రుడు. బ్రహ్మాయువు ద్వితీయ స్థానము నొడుచుకొనినాడు. శాతకర్ణి మిత్రత్వమున నేఁడతనిది తృతీయస్థానము. ఇట్టి పరివర్తనమును మంగళుఁడు సహింపలేకపోయినాడు. పూర్వమతనిపై జూపు ననురాగమును నేడు నాలందలో నుపాధ్యాయవర్గము శిఖిశాతకర్ణికి గట్టబెట్టుచున్నది.

శాతకర్ణికిని గష్టములు లేకపోలేదు. అవి ప్రధానముగ సాధువగు నమితాభునికి సాయపడుట వలన గలిగినవి. అయిననతడు వానిని లక్ష్యపెట్టుట లేదు. విజితావి, ఏకశృంగుల బారినుండి వానిని దప్పించుటకతఁడు బద్ధకంకణుఁడైనాడు. ఈ విషయము వారికిని దెలిసినది. అతఁడున్న వేళల వారు వానిజోలికి బోవుటలేదు. అతఁడు కాశ్యపుని యింటికి బయనమైన మఱుక్షణమునుండి ప్రతి నిత్యమతని నేడ్పించుట వారికి బరిపాటియైనది.

గాఢనిద్రలో నున్న అమితాయువు నెవరో బంధించినారు. అతఁడు చుట్టనుండి విడివడి తన్నుకొనుచున్నాడు. ఇట్టి దుష్కృత్యమునకు 'పశుబంధ'మని నాలంద విద్యార్థులలో వ్యవహారనామము. పశుబంధమున జిక్కుకొనిన అమితాభునికాలి కొక త్రాడుగట్టి లాగునపుడెల్ల నతడు కెవ్వున కేక బెట్టుచున్నాడు. అవి క్రమముగ బెద్దవి గాజొచ్చినవి. భూతముపైబడి పీకినట్లు అమితాభుఁడు పెద్ద బొబ్బపెట్టినాడు.

ధ్వజకేతువు త్రుళ్ళిపడి లేచి 'ఏమది అమితాభా!' అని లేచికూర్చొనినాడు. ఆ మాటవినిన నతని నోట మాట రాలేదు. మఱల నొక బొబ్బపెట్టినాడు. ధ్వజకేతువు నిదురమత్తు వదలించుకొని ద్వారముకడకు వచ్చి చూచినాడు. అతనికి అమితాభుని