పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/740

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాఏకశృంగుడతని నెంతకష్టపెట్టుచున్నాడో మీతో జెప్పవలెననుకొనినాను. వీలున్న నతనిని నీకక్ష్యలోనికి మార్పించుకొనుము. నా కక్ష్యకు జేర్పించుకొందమన్న నన్ను శీలభద్రులు కొంత కాలము వారి సేవకు వినియోగించినా'రని శాతకర్ణి యనుపస్థితిని వెల్లడించినాడు.

"కామాయనీ భిక్కునితో నీనాడే తప్పక యతనిని గుణించి మాటాడెదను. అతనిని నా కక్ష్యకు మార్పింతును”.

"అమితాభుని విషయమున శ్రద్ధవహించుట వలననతడు బ్రతికి బయటపడ గలడు. పృథువువైన నీకది ముందు ప్రయోజనకారి కాగలదు”.

శిఖి శాతకర్ణి నాలందకు వచ్చి విశేషకాలము కాలేదు. కాని యతని శీలముత్తమము, వాక్యములు సత్యయుతములు సాహసోపేతములు. ఇంతవరకు పృథువులై యుండి ధ్వజకేతువు, బ్రహ్మాయువు నిట్టి కరుణకృత్యముల నెన్నడును దలపెట్టలేదు. శాతకర్ణి ప్రేరేపించి కర్తవ్యపాలనమున కుద్యుక్తుల గావించినందుకు వారిరువురును హృదయములనతని గౌరవించిరి.

మిగిలిన మువ్వురు మిత్రులును ముందుకు సాగిపోయినారు. కొంతదూరము మార్గము బాగుగనున్నది. తరువాత కొంతదూరము వారు బ్రాకి పోవలసివచ్చినది. కష్టపడి వారు గిరి శృంగమును జేరుకొని సమతలమున గొంతసేపు సంభాషించుకొనినారు. నాలందలో విద్యార్థులు మున్నెన్నడు నొనర్పని సాహసకృత్య మొనర్చినామన్న విజయగర్వము వారి ముఖములలో నిండుకొనియున్నది.

మధ్యాహ్న భానుని క్రమ్ముకొని మేఘములు వారికి శీతలత్వమును జేకూర్చుచున్నవి. చల్లనిగాలి వీచుచున్నది. వారుత్సాహముతో కేకిసలు గొట్టుచు లోయలు ప్రతిధ్వనింప గీతిక లాలాపించినారు. కేకలు బెట్టినారు.

అదిగో! ఆ మేఘమాలిక లెంత రమణీయములుగ నున్నవి! మనపై నెండకాయుచున్నాడని సూర్యుని ముందుకు సాగి రానీయకుండ యతనిపై జైత్రయాత్ర కేగుచున్నట్టున్న వని శాతకర్ణియనినాడు.

"శిఖీ! అటు చూచినావా? కారు మొగులెట్లు క్రమ్మివచ్చుచున్నవో! వర్షించి సెలయేరులు బారించిన మనము మరల విద్యాలయమును జేరుకొనగలమా?” అని మంగళుఁడనినాడు.