పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/736

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని యతనికి ధైర్యముజెప్పి తనకక్ష్యకు బయలుదేరబోవుచున్నాడు. స్నేహపురస్సరముగ శాతకర్ణి హస్తములలో శిరముంచి అమితాభుడు బిట్టుగ రోదించినాడు. శాతకర్ణి బుజ్జగించి వెళ్ళిపోయినాడు. రాత్రియంతయు నమితాభునకు నిద్రపట్టలేదు. అతని తలగడ కన్నీటితో దడిసిపోయినది.

శిఖిహృదయము అమితాభుని దుఃఖకథ నెల్లవిన తహతహపడుచున్నది. ఉదయమే మేల్కొనిన తరువాత నమితాభుని మంచమునుండి బయటకు రమ్మనిపిలిచి వెంటబెట్టుకొని కొంత దూరమునకు దీసికొని పోయినాడు. శాతకర్ణి ప్రక్కన నడచు నపుడమితాభుడెంత యానంద మనుభవించినాడో చెప్పుటకవకాశము లేదు.

పది యడుగులు నడచిన తరువాత 'అమితా! నీకీ నాలందలో నివాసము సంతోషకరముగనున్నట్లు కనుపించదు. నిజమేనా?' అని శాతకర్ణి అమితాభుని బ్రశ్నించినాడు.

"ఔను. సంతోషము లేదు. విద్యార్థి సోదరులలో నెటజూచినను దౌష్ట్యము, నిర్దయ కనుపించుచున్నది. నా కక్ష్యలోనున్నవారందఱును నాయెడ నతినీచముగ బ్రవర్తించుచున్నారు. వారు పశువుల కంటెహీనులు, నాకు మిత్రుడన్నవాడు లేడని అమితాభుడు దీనముగా బలికినాడు.

“నన్ను నీవు మిత్రునిగ నెంచుకొనుట లేదా?”

“నీవే యిటలేకున్న నేనిక్కడ నుండగలిగెడు వాడనే కాను” శిఖి పెదవులపై నొక చిరునవ్వు నర్తించినది. రాత్రి నేను శీలభద్రాచార్యుని యొద్దనుండి వచ్చుచున్నప్పుడు నీ కక్ష్యలో విద్యార్థులొక బరుపుచుట్టను లాగుచున్నారేమిటి? "అది పరుపుచుట్టగాదు. నన్నే యొక్క దుప్పటిలో జుట్టి నేలపైలాగి చివరకు వాతాయనమునుండి క్రిందకు బడద్రోసినారు.

'ఉ. మఱల నెట్లు కక్ష్యకు రాగలిగినావు?' 'వారిలో నొకడు వచ్చికట్టు విప్పి నన్ను నడిపించుకొని వచ్చినాడు. ఈ సంగతి నెవరికైన జెప్పిన నీ ప్రాణముల దక్కనీయమని వారు నన్ను బెదిరించినారు.

“ఎంత ప్రమాదము! వారిట్టి ప్రాణమోసములకు బాల్పడుచున్నా రన్నమాట!”.

"ఇట్లు పూర్వమెపుడైన నొనర్చినారా?" "లేదు. కాని, యొకమారు కత్తిజూపినన్ను బెదరించినారు.” “ఎందుకు?” “వారిచ్చిన మత్తుపదార్థమును దాగుట కంగీకరింప