పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/720

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాతకర్ణి కతని మాటలు మనస్సున కెక్కినట్లు లేదు.

మరునాడు విద్యామందిరమునకు బయలుదేరుచు గయాశీర్షుని విద్యావిధానము నసంతృప్తిని బ్రకటింపనతడు నిశ్చయించుకొనినాడు. ఆదినమున నతని 'కంఠస్థము' మరింత నధ్వానముగనున్నది. గయాశీరుడు సూత్రపాఠముల బదిమారులు పలకపై వ్రాసిజూపు మని శిక్షజెప్పినాడు. శిఖికి పట్టరాని కోపము వచ్చినది. చేతిలో నున్నకొయ్య పలకను నేలకు విసరికొట్టి పక్కున వికటముగ నవ్వినాడు.

ఆ యవినయమును సహింపలేక గయాశీర్హుడు మండిపడి 'శిఖీ! మదించి ఓడలు మరిచినట్లున్నావు. నీవంటి నూతన విద్యార్థికడ నిట్టి యవినయము సహింపరానిది. నీకు పది దెబ్బలు శిక్ష విధించి’నా ననినాడు.

శిఖ 'చిత్త'మని చిత్రమైన గొంతుకతో వెటకారముగ బలుక నదివినిన విద్యార్థులు కలకల నవ్వినారు. గయాశీర్షునకు గొరవి ద్రిప్పినట్లైనది.

“నీవింత మూర్ఖుడవని నేననుకొనలేదు. ప్రతి దుష్టచేష్టకును శిక్ష పెరుగునని నీ వెఱుగవు కాబోలును. కక్ష్యనుండి వైదొలగి నిలువుము. పృథువు వచ్చియట శిక్షను దీర్చును”.

శిఖి భయపడుటకు ప్రతిగ గ్రంథములను, ఫలకమును జంకన బెట్టుకొని విద్యార్థుల నవ్వించుచు విలక్షణమైన నడకలతో బయటికి వెళ్ళినాడు.

గయా శీర్షుడు తోకద్రొక్కిన త్రాచువలె రోజుచున్నాడు. నూతనశిక్ష యేమీయవలెనని యాలోచించెనేగాని, యాయుపాధ్యాయుడు శాతకర్ణి ప్రస్తుతమానసిక స్థితి నణుమాత్రమైన నర్ధమొనర్చుకొనుటకు బ్రయత్నింపలేదు. అతనిశిక్షలనుచితములని, నవమాన కరములని శాతకర్ణి నిర్ణయము. అట్టి సమయమున నతని నెంత కఠినముగ శిక్షించినను ప్రయోజన ముండదు. 'ఈ దినము నీమతి క్రమముగ లేనట్లున్నది. నిన్ను నేను క్షమించుచున్నా'నని గయా శీర్షుడొక మా రౌదార్యముతో బలికిన నెంత బాగుండెడిది! మరుసటి దినమునుండి శిఖి కాలుగాలిన పిల్లివలెనతని ననుసరించెడివాడు.

కక్ష్యలో ప్రథమ విద్యార్థిని పృథువని వ్యవహరింతురు. ఉపాధ్యాయులు, నాచార్యులు జెప్పు శిక్షను పృథువులొసగుట నాలందలో పద్దతి. అందువలన గయాశీర్షుడు శాతకర్ణికి దగ్గర నుండి పృథువుచే శిక్షనిప్పించినాడు. ఆ సమయమున నతడు బెదరలేదు చెదరలేదు. కంట తడిబెట్టలేదు. హృదయమును శిలాసదృశముగ